ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 35,035 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 6,213 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో 5 గురు మరణించారు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,620కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 10,795 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 21,62,033 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 1,05,930 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,82,580కి చేరింది. గడిచిన 24 గంటల్లో 10,795 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 1,05,930 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,620కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 3,25,05,747 శాంపిల్స్ పరీక్షించారు.
దేశంలో కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 1,67,059 కేసులు నమోదుకాగా మరణాలు మాత్రం భారీగా పెరిగాయి. ఒక్కరోజులో 1,192 మంది మృతి చెందారు. కేరళ రాష్ట్రం మునుపటి గణాంకాలను సవరించడం వల్లే మరణాలు భారీగా పెరిగాయి. 2,54,076 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరణాల రేటు 1.2గా ఉంది.
- యాక్టివ్ కేసులు: 17,43,059
- మొత్తం కేసులు: 4,14,69,499
- మొత్తం మరణాలు: 4,96,242
- మొత్తం కోలుకున్నవారు: 3,92,30,198
కేరళలో కొత్తగా 42,154 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు మహారాష్ట్రలో కరోనా కేసులు తగ్గాయి. కొత్తగా 15,140 కరోనా కేసులు నమోదుకాగా 39 మంది మృతి చెందారు. మరోవైపు 91 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దిల్లీలో కొత్తగా 2,779 కరోనా కేసులు నమోదుకాగా 38 మంది మృతి చెందారు. భారత్లో టీకా పంపిణీ వేగంగా కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజులో 61,45,767 టీకా డోసులు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,66,68,48,204కు చేరింది.
Also Read: అందులో కూడా మోదీయే నం.1.. మరెవురివల్లా కాలేదు.. అయ్యగారే నం.1!