ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు మరింత మెరుగుపరచాలని ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొవిడ్‌ నియంత్రణ, వైద్యశాలలు, నాడు- నేడుపై సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దాలని అధికారును ఆదేశించారు. 45 ఏళ్లు పైబడిన వారికి, గర్భిణీలకు వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అలాగే ఆగస్టు 16 నుంచి పాఠశాలలు తెరవనున్నందున ఉపాధ్యాయులందరికీ టీకాలు ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. కొవిడ్‌19 నివారణ చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్న సీఎం జగన్... పెళ్లిళ్లు, శుభకార్యాలకు తక్కువ మంది హాజరయ్యేలా చూడాలన్నారు. కొవిడ్‌ పట్ల రాబోయే రెండు నెలలపాటు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. 


Aslo Read: Visakha Steel Plant: ఢిల్లీని తాకిన విశాఖ స్టీల్ ప్లాంట్ నిరసన సెగ.. అధికార, ప్రతిపక్ష నేతల సంఘీభావం


పెళ్లిళ్లలో 150 మందికే పరిమితం చేయాలని సూచించారు. కొవిడ్‌ పట్ల వచ్చే 2 నెలలపాటు మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. కొవిడ్ నిర్ధారణ కోసం ఆర్టీపీసీఆర్ టెస్టులు మాత్రమే చేయాలని అధికారులకు సూచించారు.  కొవిడ్ నియంత్రణ, వైద్య రంగంలో నాడు-నేడుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ నేపధ్యంలోనే అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. వచ్చే రెండు నెలలు అత్యంత కీలకమని తెలిపారు. ప్రజలందరూ కూడా కొవిడ్ ప్రోటోకాల్స్‌ను తప్పక పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.


ఇంటింటి సర్వే కొనసాగించడంతో పాటు లక్షణాలు ఉన్న ప్రతీ ఒక్కరికీ ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అలాగే 104 యంత్రాంగం సమర్థవంతంగా సేవలందించేలా నిరంతరం పర్యవేక్షణ, సమీక్ష చేయాలన్నారు.  విలేజ్‌ క్లినిక్స్‌ను పీహెచ్‌సీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అనుసంధానం చేయాలని సీఎం జగన్ సూచించారు. ప్రతీ గ్రామంలో ప్రజల ఆరోగ్య వివరాలపై మ్యాపింగ్‌ జరగాలన్న ఆయన... అటు 45 ఏళ్లు పైబడినవారు, గర్భవతులు, ఆ తర్వాత టీచర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ త్వరగా జరగాలని ఏపీ సీఎం జగన్ అధికారులకు సూచించారు. వచ్చే రెండు నెలలు అత్యంత కీలకమని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు.


Aslo Read: Polavaram : అంతకు మించి ఒక్క పైసా ఇవ్వం.. ! పోలవరంపై కేంద్రం తాజా ఆన్సర్ ఇదే..!


                AP Financial Situation: జగన్ సర్కార్ రుణాలపై కాగ్‌తో విచారణ.. పీఏసీ ఛైర్మన్ పయ్యావుల డిమాండ్.. రాజ్యాంగ ఉల్లంఘన