Visakha Steel Plant: ఢిల్లీని తాకిన విశాఖ స్టీల్ ప్లాంట్ నిరసన సెగ.. అధికార, ప్రతిపక్ష నేతల సంఘీభావం
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ABP Desam Last Updated: 02 Aug 2021 02:50 PM
Background
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ కార్మికులు, నిర్వాసితులు నేడు, రేపు రెండు రోజులపాటు ఢిల్లీలో తమ ఆందోళన కొనసాగిస్తారు. వేలాదిగా కార్మికులు ఢిల్లీకి చేరుకుని...More
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ కార్మికులు, నిర్వాసితులు నేడు, రేపు రెండు రోజులపాటు ఢిల్లీలో తమ ఆందోళన కొనసాగిస్తారు. వేలాదిగా కార్మికులు ఢిల్లీకి చేరుకుని తమ సమస్య, ఆవేదనను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తున్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
సొంతంగా గనులు కేటాయించాలి..
విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎందరో బలిదానాలు చేశారని, ఏపీ విద్యార్థులతో పాటు తెలంగాణలోని యువకులు, విద్యార్థులు సైతం పోరాటాలలో పాల్గొన్నారని విజయసాయిరెడ్డి గుర్తుచేశారు. సొంతంగా ఇనుప ఖనిజం, బొగ్గు గనులు లేని కారణంగా ఇతర గనుల నుంచి ఇనుప ఖనిజం కొనుగోలు చేయాల్సి వస్తోందని, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంతంగా గనులు కేటాయిస్తే ఈ సమస్య ఉండదన్నారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.