CM Jagan  : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రేపు హైదరాబాద్ కు వెళ్లనున్నారు. సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయానికి సీఎం జగన్ నివాళులర్పించనున్నారు. బుధవారం సాయంత్రం 3 గంటలకు పంజాగుట్ట మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.  ప్రముఖ సినీ నటుడు, సుపర్ స్టార్ కృష్ణ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు.  రేపు ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11.20 గంటలకు పద్మాలయా స్టూడియోస్‌కు చేరుకుంటారు. అక్కడ సూపర్‌స్టార్‌ కృష్ణ పార్థివ దేహానికి నివాళులర్పించనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 1.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.


సీఎం జగన్ సంతాపం


సూపర్‌ స్టార్‌ కృష్ణ కన్నుమూతతో టాలీవుడ్ విషాదం నెలకొంది. దీంతో పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. సీఎం జగన్ ట్విటర్‌ ద్వారా తన సంతాపం తెలిపారు. "కృష్ణ గారు తెలుగువారి సూపర్ స్టార్. ఆయనే అల్లూరి, ఆయనే మన జేమ్స్ బాండ్. నిజ జీవితంలో కూడా మనసున్న మనిషిగా, సినీ రంగంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న ఆయన మరణం తెలుగు సినీ రంగానికి, తెలుగు వారికి తీరని లోటు. మహేష్ కు, కృష్ణ గారి కుటుంబ సభ్యులందరికీ ఈ కష్ట సమయంలో దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను" అని సీఎం జగన్‌ ట్వీట్ చేశారు.  


మార్నింగ్ షో, షూటింగ్ బంద్ 


సూపర్ స్టార్ కృష్ణ అకాల మరణానికి సంతాపంగా చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలు శాఖలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. నిర్మాతల మండలి ఎల్లుండి షూటింగ్ లు బంద్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీలో రేపు ఉదయం షోలను బంద్ చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. బుధవారం ఏపీలో మార్నింట్ షోలు వేయకూడదని సినిమా థియేటర్ల యజమానుల సంఘం నిర్ణయం తీసుకుంది. కృష్ణ మృతికి సంతాపంగా  టాలీవుడ్ నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమా షూటింగ్‌లు తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించారు. గురువారం అధికారికంగా సినిమా షూటింగ్స్ బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.  


అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు 


మంగళవారం తెల్లవారుజామున కన్నుమూసిన సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు సీఎం సూచించారు. కేసీఆర్ ఆదేశంతో పోలీసుల అధికారిక వందనంతో కృష్ణకు తుది వీడ్కోలు పలకనున్నారు. అంతకు ముందు కేసీఆర్ కృష్ణ మృతి వార్త తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విభిన్న కుటుంబ కథా చిత్రాలతో పాటు, ప్రజలకు సామాజిక స్పృహ కల్పించే సాంఘిక చిత్రాల నటుడిగా కృష్ణ జనాదరణ పొందారని అన్నారు.  నాటి కార్మిక కర్షక లోకం కృష్ణను తమ అభిమాన హీరో గా, సూపర్ స్టార్ గా సొంతం చేసుకున్నారని సీఎం గుర్తు చేసుకున్నారని గుర్తు చేసుకున్నారు. రేపు మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తి చేయనున్నట్లు కృష్ణ సోదరుడు, నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు తెలిపారు. 


Also Read : Super Star Krishna Death: టాలీవుడ్‌లో పెను విషాదం - సూపర్ స్టార్ కృష్ణ ఇకలేరు - దివికి ఎగసిన మరో తార