రాయలసీమ జిల్లాల్లో ఇటీవల వరుణుడి ప్రళయం మర్చిపోకముందే మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అండమాన్ సమీపంలో ఈ నెల 29 అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇది బలపడి కోస్తాంధ్ర తీరం వైపు పయనించే అవకాశం ఉందని తెలిపింది.  ఈ అల్పపీడనం ప్రభావంతో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఈ నెల 30వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.  



Also Read: సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందనే వెళ్లలేదు.. అందరికీ సాయం చేశాం.. అసెంబ్లీలో సీఎం జగన్ !


నెల్లూరు జిల్లాలో మళ్లీ భారీ వర్షాలు


వరుస వాయుగుండాల ప్రభావంలో ఇప్పటికే దెబ్బ మీద దెబ్బ తిన్న నెల్లూరు  జిల్లాపై అల్పపీడనం ప్రభావం మొదలైంది. శనివారం ఉదయం నుంచి నెల్లూరు నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం కురిసిన వర్షానికి నెల్లూరు నగరంలో రోడ్లపైకి నీళ్లు చేరాయి. ఏపీలోని రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. వాతావరణశాఖ హెచ్చరికలతో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 


Also Read: ఏపీ వరి ధాన్యం లారీలకు తెలంగాణలో నో ఎంట్రీ .. సరిహద్దుల్లో నిలిచిన లారీలు !


చిత్తూరు జిల్లాలో కేంద్ర బృందం పర్యటన


ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో నష్టాన్ని అంచనా వేసేందుకు చిత్తూరు జిల్లాలో కేంద్ర బృందం పర్యటిస్తోంది. కేంద్ర బృందం తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్ రోడ్డు, ఎమ్మార్ పల్లి, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం రోడ్డు, గొల్లవాని గుంట, కృష్ణా రెడ్డి నగర్, పూలవాణిగుంట, కొరమేను గుంట ప్రాంతాలను అధికారులు పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లోని రహదారులు, ముంపునకు గురైన ఇళ్లను అధికారులు పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, కలెక్టర్ హరి నారాయణ, తిరుపతి నగరపాలక కమిషనర్‌ గిరీషా వరద నష్టాన్ని ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసి కేంద్ర బృందానికి తెలిపారు.


Also Read: ఏపీకి పొంచి ఉన్న మరో ముప్పు.. మరో మూడు రోజులు భారీ వర్షాలు.. తెలంగాణలో చిరు జల్లులకు అవకాశం..!


Also Read: దేశమంతా ఒకే జీఎస్టీ - టిక్కెట్ రేట్లూ అలాగే ఉండాలి.. జగన్ సర్కార్‌కు చిరంజీవి విజ్ఞప్తి !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి