ఏపీలో క్రితం రోజుతో పోల్చితే కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 739 మంది కరోనా బారిన పడ్డారు. మరో 14 మంది కరోనా మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 20,19,169 పాజిటివ్ కేసులకు గాను 19,90,694 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకూ 13,925 మంది మరణించారు. ప్రస్తుతం 14,550 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.


ఏపీలో నమూనా పరీక్షల సంఖ్య : 43594  


కోవిడ్19 పాజిటివ్ కేసులు: 739  


కరోనా పాజిటివిటీ రేట్ : 1.7 శాతం  


తాజా మరణాలు : 14   


అత్యధిక మరణాలు :  4 (చిత్తూరు జిల్లా)  


అత్యధిక కేసులు:  చిత్తూరు జిల్లా (166 కేసులు)  


కరోనా యాక్టివ్ కేసులు : 14550  


గడిచిన 24 గంటల్లో రికవరీల సంఖ్య :  1333


Also Read: Miracle Tree Moringa: అందానికి, ఆరోగ్యానికి.. గుప్పెడు మునగాకులు






ఏపీలో మొత్తం రికవరీ రేటు 98.6 శాతానికి చేరినట్లు అధికారులు తెలిపారు. కొవిడ్ బారిన పడి అధికంగా చిత్తూరు జిల్లాలో నలుగురు చనిపోగా.. ప్రకాశంలో నలుగురు, కృష్ణాలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, అనంతపురంలో ఒక్కరు, తూర్పు గోదావరి జిల్లాలో ఒక్కరు మరణించారు. ఏపీలో ఇప్పటివరకూ 2 కోట్ల 69 లక్షల 82 వేల 681 శాంపిల్స్‌కు కొవిడ్19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.


కరోనా కేసుల నేపథ్యంలో ఏపీ సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటోంది. వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించకూడదని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఏపీ సీఎ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. మరోవైపు స్కూళ్లు సైతం తెరుచుకోవడంతో ఏపీలో కరోనా వ్యాప్తిపై ఆందోళన వ్యక్తమవుతోంది. థర్డ్ వేవ్ ముప్పు హెచ్చరికల నేపథ్యంలో కొత్త వేరియంట్ ఏవై 12 కేసులు నమోదవుతున్నాయి. నిన్నటివరకూ ఏపీలో 18 ఏవై 12 కొత్త వేరియంట్ కేసులు పుట్టుకొచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వాలు త్వరగా అప్రమత్తం కావాలని కేంద్రం ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను హెచ్చరించింది. 


Also Read: Nipah Virus: నిఫా- కరోనా ఒకేసారి వస్తే? ఈ వైరస్ గురించి షాకింగ్ విషయాలివే