ఉన్నతాధికారులు సామాన్యుల్లా రోడ్లపై తిరుగుతూ క్షేత్ర స్థాయిలో జరుగుతున్న తీరును పసిగడుతుండడం మామూలు విషయమే. తాజాగా ఇలాగే హైదరాబాద్ కలెక్టర్ కూడా తనిఖీలు చేశారు. హైదరాబాద్‌ నగరంలోని రసూల్‌పురలోని గన్‌ బజార్‌‌లో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడి కమ్యూనిటీ హాల్‌లోని కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ సెంటర్‌కు ఆదివారం కలెక్టర్‌ శర్మన్‌ వెళ్లారు. టీకాలను పరిశీలించిన ఆయన ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లను తనిఖీ చేయాలని భావించారు. అయితే, గన్‌ బజార్‌లో చిన్న చిన్న వీధులు కావడంతో కారు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో కలెక్టర్‌ కారును పక్కకు పెట్టించారు. అక్కడే ఉన్న ఉద్యోగిని బైక్‌ తీయమన్నారు. వెనకాల కూర్చుని గన్‌బజార్‌లోని పలు ఇళ్లను సందర్శించారు. ఆయా ఇంటి సభ్యులతో మాట్లాడి వ్యాక్సిన్‌ తీసుకున్నారా, లేదా ఆరా తీశారు. 


అధికారులు వచ్చి ఇంటికి స్టిక్కర్‌ అంటించారా, వ్యాక్సిన్‌పై అవగాహన కల్పిస్తున్నారా అని తెలుసుకున్నారు. ఇలా ఒకటి, రెండు ఇళ్లు కాదు.. సుమారు 20 ఇళ్లకు పైగా సందర్శించారు. జిల్లా పరిపాలనాధికారి హైదరాబాద్‌లోని గల్లీల్లో బైక్‌పై పర్యటించి ప్రజల బాగోగులను పరిశీలించడం ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. వ్యాక్సినేషన్‌ కేంద్రాల సందర్శనలో కలెక్టర్‌తోపాటు డీఎంహెచ్‌ఓ వెంకటి కూడా ఉన్నారు.


నెల క్రితం రైతులా వచ్చిన సబ్ కలెక్టర్ 
నెల రోజుల క్రితం విజయవాడ సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ మారు వేషంలో నగరంలో తనిఖీలు చేసి అందర్నీ ఆశ్చర్యపర్చిన సంగతి తెలిసిందే. సాధారణ రైతులా లుంగీ కట్టుకొని వెళ్లి మరీ సబ్ కలెక్టర్ మారు వేషంలో వెళ్లి ఎరువుల షాపుల్లో తనిఖీలు చేశారు. రైతు వేషంలో కైకలూరులోని ఎరువుల షాపులకు వెళ్లి.. ఎరువులు కావాలని అడిగారు. స్టాక్ ఉన్నా షాప్ యజమాని లేవని చెప్పారు. సబ్ కలెక్టర్ అక్కడి నుండి మరో షాపుకు వెళ్లి ఎరువులు కావాలని అడిగారు. అక్కడ సబ్ కలెక్టర్ అడిగిన ఎరువులు ఎమ్మార్పీ ధర కన్నా సదరు షాపు యజమాని అధికంగా వసూళ్లు చేశారు. పైగా దానికి బిల్లు కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత సబ్ కలెక్టర్ ఒకొక్క అధికారికి ఫోన్ చేసి ఎరువుల షాపునకు పిలిపించారు. తర్వాత ఆ రెండు షాపులను సీజ్ చేయించారు.


Also Read: Pastor Arrest: హైదరాబాద్ లో కీచక పాస్టర్ అరెస్ట్... మత బోధనల పేరుతో మాయమాటలు... మోసపోయిన ముగ్గురు యువతులు!


Also Read: WhatsApp Status: వాట్సాప్ ఎంత పని చేసింది.. జర చూస్కోవాలి కదా బ్రో.. స్టేటస్ తో బయటకొచ్చిన అసలు కథ!


Also Read: Bypoll Politics : ఉపఎన్నిక వాయిదా వెనుక రాజకీయం ! టీఆర్ఎస్, బీజేపీల్లో ఎవరికి లాభం ?