ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ( AP Governament ) మరోసారి ఉద్యోగుల సెగ తగిలే అవకాశం కనిపిస్తోంది. పీఆర్సీ ( PRC ) పై పోరు కు మ‌రో వేదిక ఏర్పాట‌య్యింది. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ స‌మాఖ్య ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక,  పెన్షన‌ర్లంతా ఒకే వేదిక పైకి వ‌చ్చారు. పీఆర్సీ సాద‌న కోసం పోరాటాన్ని మ‌రింత ఉధృతం చేయాల‌ని తీర్మానించారు. ఈ మేర‌కు విజ‌య‌వాడ‌లో జ‌రిగిన రౌండ్ టేబుల్ ( Round Table Meeting ) స‌మావేశానికి 34 సంఘాల నుండి ప్రతినిధులు హజ‌ర‌య్యారు. స‌మావేశం అనంత‌రం వేదిక ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు.  ప్రభుత్వం ప్రక‌టించిన పీఆర్సీ ప‌ట్ల ఉద్యోగ‌, ఉపాధ్యాయ‌,కార్మిక , పెన్షన‌ర్లు తీవ్ర నిరాశ‌తో ఉన్నార‌ని తెలిపారు. 


ఉదయం "హోదా" సాయంత్రానికి తొలగింపు - విభజన సమస్యల చర్చల ఎజెండా మార్చేసిన కేంద్ర హోంశాఖ !


40 శాతం ఫిట్ మెంట్ కోరితే 27శాతం ఐఆర్ ప్ర‌క‌టించి 23 శాతం ఫిట్ మెంట్ తో స‌రిపుచ్చడం దారుణమని రౌండ్ టేబుల్ సమావేశం అభిప్రాయపడింది. క‌నీసం 27శాతం ఫిట్ మెంట్ ( Fitment ) ప్రక‌టించాల‌ని కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికుల‌ను క్రమ‌బ‌ద్దీక‌రించాల‌ని, స‌చివాల‌య సిబ్బందిని భేష‌ర‌తుగా రెగ్యుల‌ర్ చేయాల‌ని ఉద్యోగ నేతలు డిమాండ్ చేశారు. ఈ స‌మ‌స్యల ప‌రిష్కారం కోరుతూ ఈనెల 14,15 తేదీల్లో ముఖ్యమంత్రి చ‌ర్చల‌కు ఆహ్వానించాల‌ని కోర‌తామ‌న్నారు. 


పోలీసుల్ని బలిపశువులు చేస్తున్న జగన్ రెడ్డి - తప్పు చేసిన ఏ ఒక్కర్నీ వదిలి పెట్టబోమన్న చంద్రబాబు !


15 నుండి 20 వ‌ర‌కు సంత‌కాల సేక‌ర‌ణ, 21నుండి 24 వ‌ర‌కు పీఆర్సీ ఆమోదంగా ఉన్నది లేనిది బ్యాలెట్ నిర్వహించాలని నిర్ణయించారు. 26న ప్రభుత్వానికి త‌మ వేదిక త‌ర‌పున బ‌హిరంగ లేఖ రాస్తామన్నారు. మార్చి 2,3 తేదీల్లో జిల్లా స్దాయిలో రిలే దీక్షలు 7,8 తేదీల్లో రాష్ట్ర స్దాయిలో రిలే దీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. 21 నుండి 25 వ‌ర‌కు ఎమ్మెల్యేలు, ఎంపీలను క‌ల‌సి స‌మ‌స్యల ప‌రిష్కారం కోసం విజ్ఞాప‌న ప‌త్రాలు అందిస్తామ‌న్నారు. సీఎం చ‌ర్చల‌కు ఆహ్వానించి పీఆర్సీని పున:స‌మీక్షించే వ‌ర‌కు ఎన్ని నిర్బంధాలు ఎదుర‌యినా పోరాటం కొన‌సాగిస్తామ‌ని కొత్త కమిటీ నేతలు ప్రకటించారు.


గతంలో పీఆర్సీ సాధన సమితి పేరుతో ఏర్పాటయిన కమిటీలోని నలుగురు ఉద్యోగ నేతలు ప్రభుత్వానికి సరెండర్ అయిపోయి పోరాటానికి వెన్నుపోటు పొడిచారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపించాయి. అందుకే ఇప్పుడు కలసి వచ్చే సంఘాలతో కలిసి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. 34 సంఘాలు కలిసి కొత్త కార్యాచరణ ఖరారు చేసుకోవడంతో ప్రభుత్వానికి మరోసారి చిక్కులు తప్పేలా లేవు.