హైదరాబాద్ పాతబస్తీలోనీ శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలో అంతర్ రాష్ట్ర డ్రగ్స్ ముఠాను నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులు అరెస్టు చేశారు. అంతర్రాష్ట్ర ప్రధాన నిందితుడితో పాటు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితులు సురేష్ కుమార్ కైలాష్, సునీల్, కవర రామ్, ప్రకాష్ నిందితులను నార్కోటిక్ ఎన్ఫోర్స్ వింగ్(Narcotic Enforcement Wing) పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు సురేష్ కుమార్ గత 6 నెలలుగా రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కు హెరాయిన్(Heroin) తీసుకొచ్చి విక్రయిస్తున్నాడు. నిందితుల నుంచి 75 గ్రాముల హెరాయిన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.3.50 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. నిందితులను శనివారం మధ్యాహ్నం ఫలక్ నామ ఏసీపీ ఆఫీస్ లో మీడియా ముందు ప్రవేశపెట్టారు. 



రూ.15 లక్షల నిషేధిత గుట్కా స్వాధీనం 


హైదరాబాద్ లో నిషేధిత గుట్కాను తరలిస్తున్న ఇద్దరిని ఎస్.ఓ.టి, ఎల్.బి నగర్, ఘట్కేసర్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. అతడి నుంచి సుమారు రూ.15 లక్షలు విలువజేసే నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులు అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కర్ణాటక నుంచి వరంగల్ కి నిషేధిత గుట్కా(Banned Gutka) ప్యాకెట్లు తరలిస్తున్న కోట శ్రీనివాస్ , సతీష్ లను ఎల్.బి నగర్ ఎస్.ఓ.టి, ఘట్కేసర్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. గతంలో కూడా పలు పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత గుట్కా తరలిస్తూ పట్టుబడిన కోట శ్రీనివాస్ పై కేసులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. టాటా సఫారీలో నిషేధిత గుట్కా ప్యాకెట్లు తరలిస్తుండగా టోల్ గేట్ వద్ద వాహనాన్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి సుమారు రూ.15 లక్షల విలువ జేసే గుట్కా, టాటా సఫారీ వాహనం, 3 మొబైల్ ఫోన్స్, రూ.7 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలో గుట్కా ఉత్పత్తి, అమ్మకాలను ప్రభుత్వం నిషేధించిందని, గుట్కా అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మల్కాజిగిరి డీసీపీ రక్షిత మూర్తి హెచ్చరించారు. 


ఏపీలో రెండు లక్షల కేజీల గంజాయి దగ్ధం


గతేడాది నవంబర్ నుంచి ఈనెల వరకు పోలీసులు, రెవెన్యూ, వ్యవసాయ శాఖ, ఐటీడీఏ అధికారులు కలిసి ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించారు. మన్యంలో మరుమూల గ్రామాల్లో రైతులు పండిస్తున్న 8500 ఎకరాల్లోని గంజాయి పంటను ధ్వంసం చేశారు.  గంజాయి దాదాపు 2 లక్షల కిలోలు ఉంటుంది, దీని విలువ రూ.9250 కోట్ల వరకు ఉంటుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ సమక్షంలో అనకాపల్లి సమీపంలోని కోడూరు వద్ద గల నిర్మానుష్య ప్రాంతంలో గంజాయికి నిప్పు పెట్టారు.  ఒడిశా లోని 23 జిల్లాలు.విశాఖ గ్రామీణ ప్రాంతాలలోని 11 మండలాల్లో గంజాయి సాగు అధికంగా ఉంది.  ఇప్పటికే 11 మండలాల పరిథి లోని 313 శివారు గ్రామాల్లోని 7552 ఎకరాల్లో 9251.32 కోట్ల విలువ చేసే గంజాయి సాగును నాశనం చేశారు.  


Also Read:  వంద రెండు వందలు కాదు ఏకంగా రెండు లక్షల కేజీలు - గంజాయి కేసుల్లో ఏపీ పోలీసుల సంచలనం !