YSRCP New Candidates: ఏపీలో నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జుల ఐదో జాబితాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఈ జాబితాలో కేవలం ఏడుగురు అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది. వీరిలోనూ మూడు అసెంబ్లీ, నాలుగు ఎంపీ స్థానాలు ఉన్నాయి. 


అసెంబ్లీ నియోజకవర్గాలు
అరకు వేలీ (ఎస్టీ) - రేగం మత్స్యలింగం
సత్యవేడు (ఎస్సీ) - నూకతోటి రాజేష్
అవనిగడ్డ  - డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రావు


లోక్ సభ నియోజకవర్గాలు
కాకినాడ (ఎంపీ) - చలమలశెట్టి సునీల్
మచిలీపట్నం (ఎంపీ) - సింహాద్రి రమేష్ బాబు
నర్సారావు పేట (ఎంపీ) - పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్
తిరుపతి (ఎస్సీ) (ఎంపీ) - మద్దిల గురుమూర్తి


అరకు వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి రేగం మత్యలింగం ఉపాధ్యాయుడి గాను, రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తూ రాజీనామా చేసి రాజకీయాలలోకి వచ్చారు. ప్రస్తుతం వైసీపీ హుకుంపేట మండల జడ్పీటీసీగా పనిచేస్తున్నారు. కొండ దొర గిరిజన తెగకు చెందిన మత్యలింగం భార్య కూడా గతంలో హుకుం పేట ఎంపీటీసీగా పనిచేశారు.


ఇదిలా ఉంటే.. తొలి జాబితాలో 11 అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇంఛార్జిలను ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండో జాబితాలో మరో 27 స్థానాలకు (మూడు ఎంపీ, 24 అసెంబ్లీ), మూడో జాబితాలో 21 స్థానాలకు (ఆరు ఎంపీ, 15 అసెంబ్లీ), నాలుగో లిస్టులో ఎనిమిది స్థానాలకు (ఒక ఎంపీ, ఎనిమిది అసెంబ్లీ) ఇంఛార్జిలను మారుస్తూ జాబితాలను వైఎఎస్ఆర్ సీపీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఐదో జాబితాలో ఏడు స్థానాలకు (మూడు అసెంబ్లీ, నాలుగు ఎంపీ) కొత్త ఇంఛార్జిలను నియమించారు.


విజయసాయికి అదనపు బాధ్యతలు


వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్ వి.విజయసాయి రెడ్డికి గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ బాధ్యతలు అదనంగా అప్పగించారు. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం, కందుకూరు, సంతనూతలపాడు, కావలి అసెంబ్లీ నియోజకవర్గాల రీజినల్ కో ఆర్డినేటర్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించినట్లుగా వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.