Jagan Video: మీకు 15వేలు, మీకు 15వేలు, మీకు 18వేలు.. సోషల్ మీడియాలో ఇటీవల బాగా పాపులర్ అవుతున్న డైలాగులివి. అమ్మఒడిని తల్లికి వందనంగా మార్చి ఆర్థిక సాయం పెంచి ఇస్తామంటూ ఎన్నిక సమయంలో నిమ్మల రామానాయుడు చెప్పిన మాటలివి. వీటిని వైసీపీ అధినేత జగన్ ఇటీవల బాగా పాపులర్ చేశారు. తన పర్యటనల్లో ఆయన తరచూ ఆ మాటల్ని రిపీట్ చేసేవారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ఏపీలో వివిధ ప్రాంతాల్లో జరిగిన ఊరేగింపుల్లో కూడా ఈ మాటల్ని వైసీపీ కార్యకర్తలు రిపీట్ చేస్తూ సందడి చేశారు. తాజాగా పిఠాపురం పర్యటనలో కూడా జగన్ ఈ మాటలే మళ్లీ చెప్పారు. జనం రియాక్షన్ బాగుండటంతో ఆయన హుషారుగా టీడీపీ నేతల్ని అనుకరించి ఆకట్టుకున్నారు.
జగన్ గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కానీ ఈసారి ఆయన హావభావాలు వేరే లెవల్ లో ఉన్నాయి. గతంలో ఎప్పుడూ లేనంత ఉత్సాహంగా ఆయన ఈసారి ఆ డైలాగుల్ని రిపీట్ చేశారు. ప్రెస్ మీట్ లో తన ముందున్న పిల్లల్ని పిలుస్తూ మరీ టీడీపీ నేతల్ని అనుకరించారు. అయితే ఈ అనుకరణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అప్పుడెప్పుడో నిమ్మల రామానాయుడు చెప్పిన మాటలకంటే జగన్ హావభావాలు బాగున్నాయని అంటున్నారు నెటిజన్లు. టీడీపీ మాత్రం జగన్ ని ట్రోల్ చేయడం మొదలు పెట్టింది.
ప్రకాశం బ్యారేజ్ ని పడవలు ఢీకొనడాన్ని, జగన్ హావభావాలకు జత చేస్తూ ఆయన వీడియోని టీడీపీ ట్రోల్ చేసింది. దగ్గరకొచ్చేయ్, దగ్గరకొచ్చేయ్.. అంటూ జగన్ చెబుతున్న మాటలకు బోట్లు బ్యారేజ్ దగ్గరకు వస్తున్న వీడియోని జత చేసింది టీడీపీ. టీడీపీకి కౌంటర్ ఇస్తూ జగన్ చేసిన వ్యాఖ్యల్ని తిరిగి ఇలా టార్గెట్ చేసింది.
అమ్మఒడి విషయంలో గతంలో వైఎస్ భారతి చేసిన వ్యాఖ్యల్ని మరికొందరు గుర్తు చేస్తూ జగన్ కి కౌంటర్ ఇస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ తరపున ప్రచారం చేసే సమయంలో జగన్ సతీమణి భారతి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి అమ్మఒడి సాయం అందుతుందన్నారు. ఇప్పుడు జగన్ చేసిన కామెంట్లు వారికే రివర్స్ లో తగులుతున్నాయని టీడీపీ నేతలు అంటున్నారు.
Read Also: వైసీపీ ఫైర్ బ్రాండ్లకు మైక్ ఇచ్చిన జగన్- పార్టీలో శ్యామలకు ప్రమోషన్
మీకు 15వేలు, మీకు 15వేలు అంటూ టీడీపీ నేతల్ని జగన్ ఇమిటేట్ చేసిన తాజా వీడియోని వైసీపీ పెద్దగా పట్టించుకోకపోవడం విశేషం. వైసీపీ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లలో ఈ వీడియోని ప్రత్యేకంగా హైలైట్ చేయలేదు. బహుశా టీడీపీ ట్రోలింగ్ మొదలు పెట్టింది కాబట్టి వైసీపీ సైలెంట్ గా ఉందనుకోవాలి. అదే సమయంలో జగన్ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొంతమంది జగన్ హావభావాలకు నెగెటివ్ కామెంట్లు పెడుతున్నారు. అందుకే పిఠాపురం వీడియో విషయంలో వైసీపీ సైలెంట్ గా ఉంది.
Also Read: ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా