వివేక హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం ఈసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. హైకోర్టు వెకేషన్ బెంచ్‌ తన బెయిల్ పిటిషన్‌ విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని రిక్వస్ట్ పెట్టుకున్నారు. సీజేఐ ముందు దీన్ని ప్రస్తావించాలని భావించారు. మెన్షనింగ్ లిస్ట్‌ వినకుండానే బ్యాచ్‌ల వారీగా తేదీలను కేటాయిస్తామన్నారు సీజేఐ. దీని విచారణ తేదీని కూడా వెల్లడించలేదు. అత్యవసరం అనుకుంటే రాతపూర్వకంగా అభ్యర్థన ఇవ్వాలని సూచించింది. అప్పుడు అత్యవసరంగా విచారించాలా లేదా అన్నది ఆలోచిస్తామని సీజేఐ ధర్మాసనం తేల్చి చెప్పింది. 


అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో ఉంది. వేసవి సెలవుల తర్వాత విచారిస్తామని న్యాయస్థానం తేల్చింది. సీబీఐ తన పని తాను చేసుకుపోవచ్చని స్పష్టం చేసింది. అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను జూన్ ఐదో తేదీకి ధర్మాసనం వాయిద వేసింది. అప్పుడే ఈ కేసు విచారణ సందర్భంగా  వెకేషన్ బెంచ్ కు మార్చుకుంటారా పార్టీలను అడిగిన న్యాయమూర్తి అడిగారు. అయితే ప్రధాన న్యాయమూర్తి ఎదుట మెన్షన్ చేసి ఆర్జెన్సీ ఉందని చెప్పాలని సూచించారు. 


Also Read:మరోసారి సునీత, రాజశేఖర్ రెడ్డి స్టేట్‌మెంట్ రికార్డ్ - లేఖపై సీబీఐ క్లారిటీకీ వచ్చినట్లేనా ?


ముందస్తు బెయిల్‌ ఇస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టి  వేసింది. దీంతో సీబీఐ తన పని తాను చేసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై కనీసం రెండు వారాలైనా రిలీఫ్ ఇవ్వాలని.. కస్టోడియల్ ఇంటరాగేషన్‌కు కూడా రెడీ అని అవినాష్ తరపు లాయర్లు వాదించినప్పటికీ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. వేసవి సెలవుల తర్వాతే తదుపరి విచారణ జరగనుందని తేల్చేశారు. 


ఏప్రిల్‌ 28న ఈ నిర్ణయం వెలువడినా ఇప్పటి వరకు సీబీఐ కానీ, అవినాష్ రెడ్డి నుంచి రియాక్షన లేదు. అయితే ఈ మధ్య వివేకానంద రెడ్డి కుమార్తె సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి గతంలో బెయిల్ రద్దు ఇవ్వడంతో ఆ ఉత్తర్వులలో ఓ షరతును సుప్రీం కోర్టులో సునీతా రెడ్డి సవాలు చేశారు. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు జులై 1న మళ్లీ విడుదల చేయాలని సీబీఐ కోర్టుకు ఆదేశాలు ఇచ్చింది. బెయిల్‌ను గంగిరెడ్డి దుర్వినియోగం చేసిన ఉదాహరణలు ఉన్నాయని పిటిషన్ లో చెప్పారు. సాక్షులను కూడా బెదిరించే అవకాశాలు ఉంటాయని వివరించారు. హత్యలు చేసిన వాళ్లు బయట ఉంటే సమాజంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు. 


Also Read: వివేకా కేసులో మళ్లీ సుప్రీంకోర్టుకు సునీతా రెడ్డి, ఆ షరతును సవాలు చేస్తూ పిటిషన్


సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ విచారణకు రానున్న టైంలో సీబీఐ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. మంగళవారం మధ్యాహ్నం విచారణకు రావాలని పిలుపునిచ్చింది. దీంతో ఆయన తనకు షార్ట్ నోటీసు ఇస్తే విచారణకు రాలేనని చెప్పారు. నాలుగు రోజుల గడువు కావాలని కోరారు. అవినాష్ రెడ్డి రాసిన లేఖపై స్పందించిన సీబీఐ మూడు రోజుల గడువు ఇచ్చింది. 19వ తేదీన కచ్చితంగా విచారణకు రావాలని పిలుపునిచ్చింది. ఈ విచారణ ఉన్న తరుణంలో ముందస్తు బెయిల్  ప్రయత్నాలు మరోసారి అవినాఖ్ ముమ్మరం చేశారు.