Vidadala Rajini About Chandrababu: పేదల ఆత్మగౌరవం, ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం ఆయన పెద్దరికానికి తగదని మంత్రి విడదల రజిని అన్నారు. నివాసానికి ఇచ్చిన స్థలాలను సమాధులతో పోలుస్తారా అంటూ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఇచ్చే సెంటు స్థలం నివాసానికి పనికారాదని... వారు చనిపోయాక సమాధులు కట్టుకోవడానికి పనికొస్తుంది అంటూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.


హైవేపై నిరసన ర్యాలీ
చంద్రబాబు చేసిన అనుచిత వ్యఖ్యలకు  నిరసనగా శుక్రవారం చిలకలూరిపేట పట్టణంలో నిరసన ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజని, చిలకలూరిపేట వైయస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం 16వ నెంబర్ జాతీయ రహదారిపై మానవహారంగా ఏర్పడి చంద్రబాబు డౌన్ డౌన్ తెలుగుదేశం డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు. రాష్ట్ర  వ్యాప్తంగా ఉన్న నిరుపేదల సొంతింటి కల సాకారం చేసేందుకు సీయం జగన్  ప్రతి పేద వాడికి సెంటు భూమి ఇచ్చే  బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మంత్రి రజనీ అన్నారు. 


పేదవాడి సొంతటి‌‌ కల సాకారం
సంక్షేమ పథకాలు తో రాష్ట్ర ప్రజలను ఆదుకోవడమే కాకుండా ఇళ్ళు లేని పేదవాడు రాష్ట్రంలో ఉండకూడదు అన్న లక్ష్యంతో  వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. సక్షేమ పథకాల తో అల్పాదాయ వర్గాలు సహితం ఆర్థిక ఇబ్బందులు అదిగమిస్తూ సంతోషం గా ఉన్నారని పేర్కొన్నారు... సంక్షేమ పథకాలతో సరి పెట్టకుండా పేద ప్రజలు కు సొంతింటి కల నెరవేర్చాలని నివేశిన స్థలాలు పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు..


మధ్యయుగం నాటి మనస్తత్వం
అప్పటినుంచి‌ ప్రతిపక్ష ‌టీడీపీ ప్రభుత్వం, పేదలపై విషం చిమ్ముతోందన్నారు. పేదలు.. పేదరికంలోనే  ఉండాలన్న మధ్యయుగం భావజాలంతో చంద్రబాబు అండ్ కో పేదలను ఉద్దేశిస్తూ తీవ్ర  వ్యాఖ్యలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పాలనలో చంద్రబాబు ఏనాడైనా ఒక్కటి అంటే ఒక్కటి కూడా మంచి చేశాడా అని ప్రశ్నించారు విడదల రజిని. చంద్రబాబు పాలనలో   రాష్ట్రంలో ఉన్న ఏ వర్గాన్ని ఆదుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Andhra News : ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బందేనా ? బిల్లులు రావడం లేదంటున్న ఆస్పత్రులు !


పేదవాడికి రాజధానిలో భూములు ఇస్తే‌ తప్పా?
పేద వర్గల జన్మజన్మల కల సొంత గూడు.. వారి కల సాకారం చేసేందుకు సీఎం జగన్ అమరావతి లో 59వేల పేద కుటుంబాలకు  ఇళ్ల స్థలాలు ఇస్తుంటే టీడీపీ నాయకులు, చంద్రబాబు తొట్టుకోలేక నోటికి వచ్చినట్లు మాట్లాడతున్నారని మంత్రి విడదల రజిని ఫైర్ అయ్యారు. సీఎం జగన్ పేదలకు రాజధాని ప్రాంతంలో అందిస్తున్న సెంటు స్థలం, సమాధితో చంద్రబాబు పోల్చడము కరెక్టేనా... ఇదేనా మర్యాద... వయస్సుకు తగిన మాటలు మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు. లేక పోతే కాల గర్భంలో కలిపేస్తారని అన్నారు .
పేద వాడికి ఒక ఇల్లు ఉంటే ఆర్థిక స్థిరత్వం వస్తుందని భావించి సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టారని స్పష్టం చేశారు. ఇంటి స్థలాన్ని సమాధులలో పోల్చి చంద్రబాబు పెదవాళ్ళు ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసే విధంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమం పట్టని చంద్రబాబు అండ్ కో ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా వైసీపీ ప్రభుత్వం వెనుకంజ వేయదన్నారు. ఏది ఏమైనా పేద వాళ్ళ అభివృద్ధి, సంక్షేమ మే వైస్సార్సీపీ ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు.
Also Read: Telangana News : ఏపీలో ఉండలేం తెలంగాణలో కలపండి - ఆ ఐదు గ్రామాల ప్రజల డిమాండ్ !