AP EMRS Inter: ఏకలవ్య గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశాలు, ఎంపిక ఇలా!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 14 ఏకలవ్య గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరములో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్‌ వెలువడింది..

Continues below advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 14 ఏకలవ్య గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరములో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (గురుకులం) విడుదల చేసింది. అర్హులైన పదో తరగతి ఉత్తీర్ణులైన గిరిజన, గిరిజనేతర విద్యార్థులు మే 31లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

Continues below advertisement

వివరాలు..

* ఏకలవ్య గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశాలు 

గురుకులాల సంఖ్య: 14

సీట్ల సంఖ్య: 1360

అందించే కోర్సులు..

➥ ఎంపీసీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)

➥ బైపీసీ (బోటనీ-ఫిజిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)

➥ సీఈసీ (సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్)

➥ హెచ్‌సీఈ (హిస్టరీ, కామర్స్, ఎకనామిక్స్)

➥ ఎంఈసీ (మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్)

➥ ఒకేషనల్‌ 

అర్హత:  పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: కౌన్సెలింగ్ (ధ్రువపత్రాల పరిశీలన) ద్వారా. 

ముఖ్యమైన తేదీలు..

➥ ప్రవేశ ప్రకటన విడుదల: 16.05.2023. 

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.05.2023.

➥ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 31.05.2023.

➥ మెరిట్ జాబితాల వెల్లడి: జూన్ మొదటివారంలో.

➥ కౌన్సెలింగ్ నిర్వహణ: జూన్ మొదటివారంలో.

Paper Notification

Notification

Online Application

Website

Also Read:

ఏపీ మైనార్టీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్, వివరాలు ఇలా!
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని మూడు ఏపీ మైనార్టీ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరంలో సీట్ల భర్తీకి సంబంధించిన ఏపీఆర్‌జేసీ(మైనార్టీ) సెట్‌-2023 నోటిఫికేషన్ వెలువడింది. గుంటూరులోని ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. అర్హులైన మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన విద్యార్థులు జూన్‌ 28 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణ ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్‌ ప్రవేశాలు, దరఖాస్తు ప్రారంభం!
తెలంగాణ‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరం(ఆంగ్ల మాధ్యమం)లో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్‌ వెలువడింది. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మే 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి పాఠశాలలో బాలికలకు భోజన, వసతి సౌకర్యం కల్పిస్తారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్, ఎంసెట్, సీఏ, టీపీటీ, సీఎస్ తదితర పోటీపరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో ఒక్కో దాంట్లో 40 సీట్లు ఉంటాయి.
ప్రవేశాల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంట‌రీ ప‌రీక్షల షెడ్యూలు విడుద‌ల‌, పరీక్షల తేదీలివే!
తెలంగాణలో మే 9న ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ఫ‌లితాలు విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఈ ప‌రీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం జూన్ 12 నుంచి ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షల‌ు నిర్వహించ‌నున్నట్లు ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు బుధ‌వారం (మే 17) తెలిపింది. ఈ మేర‌కు ప‌రీక్షల టైం టేబుల్‌ను కూడా విడుద‌ల చేసింది. ప్రథ‌మ సంవ‌త్సరం విద్యార్థుల‌కు ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ద్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు, ద్వితీయ సంవ‌త్సరం విద్యార్థుల‌కు మ‌ధ్యాహ్నం 2:30 గంట‌ల నుంచి సాయంత్రం 5:30 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్షల‌ను నిర్వహించ‌నున్నారు.
పరీక్షల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Continues below advertisement
Sponsored Links by Taboola