Andhra News : ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం అందించే ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. శుక్రవారం నుంచి పూర్తిగా నిలిపివేయాలని నెట్‌వర్క్ ఆసుపత్రులు నిర్ణయించాయి. ఇప్పటికే అత్యవసర చికిత్సలు మినహా మిగతా సేవలను ఆస్పత్రులు నిలిపివేశాయి. రూ.750 కోట్ల రూపాయల వరకు బకాయిలు ఉండటంతో సేవలు నిలిపివేయాలని ఆస్పత్రులు నిర్ణయించాయి. కేంద్రం నుంచి ఆయుష్మాన్ భారత్ కింద వచ్చిన నిధులను రాష్ట్ర సర్కార్... మెడికల్ కళాశాలల నిర్మాణానికి మళ్లించింది. దీంతో ఆయుష్మాన్ భారత్ కింద నిధులను కేంద్రం నిలిపివేసింది. నిధులు రాకపోవడంతో ఆస్పత్రుల నిర్వహణ కష్టంగా మారిందని యాజమాన్యాలు చెబుతున్నాయి.
ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు షరతులపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం - వెకేషన్ బెంచ్‌లో విచారణకు నిర్ణయం !
గతంలోనే బకాయిలకు సంబంధించి ప్రభుత్వం కొంత మొత్తాన్ని చెల్లించాలని నిర్ణయం తీసుకుంది.కానీ బిల్లులు చెల్లించలేదు. ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల్లో 2263 ఆస్పత్రులకు అనుమతి ఇచ్చింది. పై వైద్యశాలలన్ని ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ పరిధిలో ఆరోగ్య శ్రీ కార్డు కలిగిన లబ్దిదారులకు సుమారు 3357 రోగాలకు సంబంధించి ఉచితంగా సేవలను అందిస్తుంది. అయితే అందుకు సంబంధించి నెట్‌వర్క్ వైద్యశాలలకు ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుంది. అయితే ప్రభుత్వం వారికి నేరుగా బిల్లులు చెల్లించడం లేదు. గతంలోనే ఇదే అంశంపై నెట్‌వర్క్ ఆస్పత్రుల సంఘ నేతలు బిల్లుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. మార్చి నెలాఖరు లోపు కొంత మొత్తాన్ని చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఆ మేరకు చెల్లింపులు జరగలేదు.
ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై హైకోర్టు స్టే - ఎందుకంటే ?
ఏపీ వ్యాప్తంగా లక్షలాది మంది పేదలు ఆరోగ్య శ్రీ ద్వారా వైద్య సేవలను పొందుతున్నారు. నిత్యం ప్రతి వైద్యశాలలో 50 నుంచి 100 వరుక ఆరోగ్య శ్రీ ఓపీలు ఉంటున్నాయని చెబుతున్నారు. రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల పరిధిలో ఆరోగ్య్రశీని నమ్ముకుని ఎంతో మంది పేదలు చికిత్స పొందుతున్నారని అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జలుబు, జ్వరాలతో పాటు కొవిడ్ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య శ్రీ సేవలకు ఆటంకం కలిగితే పేద ప్రజలు మరింత ఇబ్బందులకు గురయ్యే అవకా శం ఉంది.