Amaravati foundation stone :  అమరావతి విషయంలో కేంద్రం మరో మందడుగు వేసింది.   అమరావతి కేంద్రంగా క్వాంటం కంప్యూటింగ్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్  , లార్సన్ & టూబ్రో  సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి.  అమరావతిలో భారతదేశపు మొట్టమొదటి, అత్యాధునిక క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ నిర్మాణం ఈ మూడు దిగ్గజ సంస్థల కేంద్రంగా జరగనుంది.  2026, జనవరి 1న దీన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. 

క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అనేది క్వాంటమ్ టెక్నాలజీ పరిశోధన- అభివృద్ధికి  కేంద్రంగా ఏర్పడే హబ్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ITకి  సిలికాన్ వ్యాలీ  ఏవిధంగా కేంద్రమో… క్వాంటెక్నాలజీకి ఇది కూడా ముఖ్యకేంద్రంగా ఉంటుంది. క్వాంటమ్ కంప్యూటర్లు క్విబిట్స్ (qubits) అనే ప్రత్యేకమైన డేటా యూనిట్లను ఉపయోగించి సాధారణ కంప్యూటర్ల కంటే వేగంగా సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించగలుగుతాయి.. ఇది డ్రగ్ డిస్కవరీ, క్లైమేట్ మోడలింగ్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకురావచ్చు.

ఈ ప్రాజెక్ట్ భారతదేశపు నేషనల్ క్వాంటమ్ మిషన్‌తో అనుసంధానంగా ఉండనుంది.  ఈ మిషన్ లో 50 నుండి 1,000 ఫిజికల్ క్విబిట్స్ కలిగిన మధ్యస్థాయి క్వాంటమ్ కంప్యూటర్ల అభివృద్ధి, దేశీయంగా  అంతర్జాతీయంగా 2,000 కిలోమీటర్ల దూరంలో శాటిలైట్ ఆధారిత భద్రతా కమ్యూనికేషన్ వ్యవస్థలు స్థాపన వంటి లక్ష్యాలున్నాయి. 

ఈ ప్రాజెక్ట్‌లో IIT Madras భాగస్వామ్యం ఉంది.  "క్వాంటమ్ టెక్నాలజీ అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులను తెస్తుంది. 1990లలో ఐటీ రంగంలో ముందుండినట్లుగా, ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీలో నాయకత్వం వహిస్తుందని చంద్రబాబు పలుమార్లు చెప్పారు. ఇప్పటి వరకూ కెనడాలోని  Waterloo  , జర్మనీలోని Munich లో Quantum Vally లు ఉన్నాయి. అమరావతి కేంద్రాన్ని కూడా అదే రీతిలో అభివృద్ధి చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు.  రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ ప్రత్యేక ప్రథాన కార్యదర్శి కన్వీనర్‌గా క్వాంటమ్ కంప్యూటింగ్‌లోని నిపుణులతో ఈ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు  ఈ వ్యాలీ నిర్మాణమంలో కీలకంగా ఉంటోంది.  అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడం, భాగస్వామ్యాలు నెలకొల్పడం ఈ టాస్క్ ఫోర్స్ ప్రధాన ఉద్దేశ్యం.

టీ తర్వాత వచ్చిన బయో టెక్నాలజీని కూడా చంద్రబాబు ప్రోత్సహించారు. అప్పుడే జీనోమ్ వ్యాలీని ఏర్పాటు చేయించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత బ్లాక్ చైన్, క్లౌడ్ కంప్యూటింగ్, ఫిన్‌టెక్ వచ్చాయి. మూడోసారి సీఎం అయినప్పుడు వాటికి ప్రాథాన్యత ఇచ్చారు. ఇప్పుడు మోస్ట్ అడ్వాన్స్‌డ్ క్వాంటమ్ టెక్నాలజీపై దృష్టి సారించారు. క్వాంటమ్‌ వ్యాలీని అమరావతి కేంద్రంగానే ఏర్పాటు చేస్తున్నారు.