బీసీ జన గణన చేపట్టాలని కోరుతూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నారు.  బీసీ జనగణన డిమాండ్ దేశవ్యాప్తంగా వినిపిస్తోంది.  జనాభా లెక్కల్లో ప్రత్యేకంగా బీసీల గణన చేపట్టాలని కోరుతున్నారు. అయతే కేంద్రం మాత్రం ఈ అంశంపై స్పందించడం లేదు.  బీసీ వర్గాల నుంచి వస్తున్న డిమాండ్ల మేరకు ఏపీ ప్రభుత్వం బీసీ జనగణనకు మద్దతుగా అసెంబ్లీలో తీర్మానం చేసింది. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ తీర్మానం ప్రవేశ పెట్టారు. తర్వాత సీఎం జగన్ దీనిపై మాట్లాడారు.  బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదు.. బ్యాక్‌ బోన్‌ క్లాస్‌ అని సీఎం జగన్‌ తెలిపారు. బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా పైకి తెస్తున్నామని స్పష్టం చేసారు. 


Also Read: మళ్లీ 3 రాజధానులా? అసలు జీతాలకు డబ్బులున్నాయా? ఆత్మ పరిశీలన చేసుకోండి: సోము వీర్రాజు


బీసీ కులగణన జరిగితే మరింత వెసులుబాటు కలుగుతుందని అందుకే కులగణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేస్తున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. బీసీలను సామాజికంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని సీఎం చెప్పారు. టీడీపీ హయాంలో ఓట్ల వారీగా కులాలను విభజించారని ఆరోపించారు.   తమ పాలనలో ఎక్కడ కూడా లంచాలు లేవని, అవినీతి లేదని తెలిపారు.  


Also Read: Chandrababu: చంద్రబాబుకు మద్దతుగా మహిళా ఉద్యోగి రాజీనామా.. 2024లో మళ్లీ సీఎం అయ్యాకే..!


నాటి నుంచి బీసీల జనాభా అందాజుగా లెక్కిస్తున్నారు తప్ప కచ్చితమైన లెక్కలేదని తెలిపారు. దశాబ్దాలుగా సామాజికంగా, ఆర్థికంగా బీసీలను ఎదగనివ్వడం లేదని అన్నారు. బీసీల ఎంతమంది ఉన్నారని తెలిస్తేనే వారికి న్యాయం చేయగలుగుతామని అన్నారు. బీసీల లేక్కలు తేలితే ప్రభుత్వానికి స్పష్టత వస్తుందని సీఎం తెలిపారు. జనగణన లేకపోవడంతో బీసీలు వెనకబడిపోయారని సీఎం అన్నారు. అందుకోసమే జనగణన చేయాలని సభ ద్వారా తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తున్నామని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.


Also Read: మండలిని రద్దు చేయవద్దు ..ప్లీజ్.. ! కేంద్రానికి ఏపీ ప్రభుత్వం మరో తీర్మానం !


టీడీపీ పాలనలో రాజ్యసభకు ఒక్క బీసీని కూడా పంపిచలేదని సీఎం జగన్‌ అన్నారు. నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 67 శాతం ఇచ్చామని చెప్పారు. జడ్పీ ఛైర్మన్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 69 శాతం ఇచ్చామని సీఎం పేర్కొన్నారు. 13 మేయర్‌ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 92 శాతం ఇచ్చామని తెలిపారు. ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 నామినేటెడ్‌ ఛైర్మన్ల పదవుల్లో బీసీలకు 53 ఇచ్చామన్నారు. తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది.


Also Read: ఓ అడుగు వెనక్కి వేసి.. మరో అవకాశం సృష్టించుకున్న జగన్ ! బిల్లుల ఉపసంహరణ వెనుక పక్కా రాజకీయ వ్యూహం !



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి