ఆహార పరిశ్రమకు చెందిన వ్యాపారస్తులు, ఆవిష్కర్తలు, వాటాదారులకు ఒక మంచి వేదిక సమకూర్చటంలో ఇండస్‌ ఫుడ్‌ నిర్వాహకులు విజయవంతం అయ్యారని  తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ అధినేత మునగాల మోహనశ్యామ్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో మూడు రోజులు పాటు జరిగిన ప్రదర్శనలో తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ తమ ఉత్పత్తులను ప్రదర్శించింది. ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ మేళా జరిగింది. 


తెనాలి డబల్ హార్స్ అనేక రకాల పప్పులతోపాటు, ఇన్స్టెంట్ పౌడర్లు, కారపొడులు, పచ్చళ్లు, సున్నుండలు, అప్పడాలు, మిల్లెట్స్ ఇలా 31 రకాల రెడీ టు ఈట్, రెడీ టు కుక్ వంటి ఉత్పత్తులు తయారు చేస్తుందని వివరించారు. ఈ స్టాల్‌ను అమెరికా, కెనడా, దుబాయ్, సింగపూర్, జర్మనీ, సౌత్ ఆఫ్రికా, యూకే , న్యూజిలాండ్, నేపాల్ , ఆస్ట్రేలియా ఇలా  అనేక దేశాల నుంచి వచ్చిన వ్యపారస్తులు సందర్శించారు. ఉత్పత్తులపై ఆసక్తిని తెలియపరిచారు. 


ఇదే ఉత్సాహంతో ఫిబ్రవరి 19న జరగబోయే గల్ఫ్ ఫుడ్ ఎక్సపోలో కూడా పాల్గొబోతున్నామని ప్రకటించారు.డబుల్ హార్స్ గ్రూప్ అధినేత.