సుప్రీంకోర్టు కొలీజియం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతి, ఐదుగురు సీజేఐల బదిలీలను ప్రదిపాదిస్తూ కేంద్రానికి సిఫార్సు చేసింది. సిఫార్సుల్లో భాగంగా తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు కొత్త ప్రధాన న్యాయమూర్తుల పేర్లను ప్రతిపాదించింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో ప్రస్తుతం కర్ణాటక తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మ పేరును సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రను ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేసింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదన చేసింది. వివిధ అవసరాల దృష్ట్యా ఒకేసారి 25 మంది న్యాయమూర్తుల బదిలీకి ఆమోదం తెలిపింది. మొత్తం 41 మందికి స్థాన చలనం కలగనుంది. ఈ సిఫారుసుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు ఇద్దరు కొత్త ప్రధాన న్యాయమూర్తులు రానున్నారు. తెలంగాణ నుంచి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తితో పాటు మరో న్యాయమూర్తి బదిలీ అవుతారు. ఆంధప్రదేశ్ నుంచి ప్రధాన న్యాయమూర్తి బదిలీ కాగా, అక్కడికి మరో ప్రధాన న్యాయమూర్తితో పాటు, కొత్తగా ఇద్దరు న్యాయమూర్తులు వస్తారు.
ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రను ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ అవుతారు. ఆంధ్రప్రదేశ్ సీజే జస్టిస్ అరూప్ గోస్వామిని ఛత్తీస్‌గఢ్ పంపాలని కొలీజియం ప్రతిపాదించింది. ఏపీ హైకోర్టుకు పట్నా నుంచి జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా, అలహాబాద్ నుంచి జస్టిస్ రవినాథ్ తిల్హరీలను బదిలీ చేయాలని సిఫార్సు చేశారు.
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వచ్చే అవకాశం ఉన్న జస్టిస్ సతీష్.. కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అవుతారు. కర్ణాటక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓక్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.
Also Read: AP LAWCET 2021: ఏపీ లాసెట్ హాల్ టికెట్లు రిలీజ్ అయ్యాయి.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
Also Read: Jogi Ramesh : అయ్యన్న వ్యాఖ్యలపై జోగి రమేష్ ఒక్కరే ఎందుకు స్పందించారు ? వ్యూహమా ? రాజకీయమా ?