Bharat Chaitanya Yuvajana Party: ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రామచంద్ర యాదవ్‌ కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. తన పార్టీ పేరు  ‘భారత చైతన్య యువజన పార్టీ’ (BCY) అని ప్రకటించారు. గుంటూరు శివారులోని నాగార్జున యూనివర్సిటీ వద్ద ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ స్థాపించి, కొత్త పార్టీ పేరును విధివిధానాలను ఆయన ప్రకటించారు. ఆయనకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, అంత బలమైన వ్యక్తా అని ఏపీలో చర్చ జరుగుతోంది.


అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారి ఆకాంక్షలు నెరవేర్చే లక్ష్యంతో భారత చైతన్య యువజన పార్టీ స్థాపించానని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పాలనలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగాయని, ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ అవసరం ఉందన్నారు. వైసీపీలో కార్యకర్తల నుంచి పెద్దల వరకు అంతా దోచుకుంటున్నారని ఆరోపించారు. సీఎం జగన్ పాలనను పురాణాల్లో రాక్షసుల్ని గుర్తుకు చేసిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రైవేట్ ఆస్తులకు, ప్రైవేట్ భూములకు రక్షణ లేదని అభిప్రాయపడ్డారు. పార్టీ స్థాపన బహిరంగ సభకు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌ మనువడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌, సూరజ్‌ మండల్‌, రామచంద్ర యాదవ్ మద్దతుదారులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.


ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మద్దతుతోనే పార్టీ.. 
రాష్ట్రాన్ని ఇప్పటి వరకు పరిపాలించిన పార్టీల వల్ల కేవలం 10 శాతం ప్రజలకే ప్రతిఫలం దక్కింది. మిగతా 90 శాతం ప్రజలు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగపడగలిగారని రామచంద్ర యాదవ్ అంటన్నారు.  పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆర్థిక, సామాజిక, రాజకీయ అస్థిరత ఏర్పడుతుంది. ప్రజా సంపద కొందరి చేతిలోనే బంధీ అవుతుంది. ఇప్పటికే దౌర్జన్యాలు, దందాలు, ప్రజా సంపద దోపిడీతో రాష్ట్రానికి, ప్రజలకు ఏ విధంగా నష్టం చేకూరుతోందో మన కళ్లెదుటే స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు.  ఈ పరిస్థితిని మార్చడానికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర వర్గాల్లోని వారి మద్దతుతో


గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన రామచంద్ర యాదవ్ 


2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆయన పోటీ చేశారు.  అప్పుడు నేను రాజకీయాలకు కొత్త. అప్పటి పరిస్థితులు వేరు. అందువల్ల ఓటమి చవిచూడాల్సి వచ్చిందని అంటున్నారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నప్పటికీ, కొత్తగా ఎన్ని పార్టీలు వచ్చినప్పటికీ ధైర్యంగా ప్రజల కోసం ఎన్ని నిలబడ్డాయన్నదే ప్రధానం. వివిధ రకాల అజెండాలతో ఇప్పటి వరకు పలు పార్టీలు వచ్చి ఉండవచ్చు. పార్టీ నడపాలంటే కేవలం డబ్బు మాత్రమే ఉంటే సరిపోదు. ఓపిక, ధైర్యం, నిజాయితీ, ప్రజలకు మేలు చేయాలన్న తపన చాలా ముఖ్యం. వీటన్నింటితో పాటు కమిట్‌మెంట్‌ ఇంకా ప్రధానం. అవన్నీ తనకు ఉన్నాయని రామచంద్ర యాదవ్ చెబుతున్నారు.  అనంతపురం నుంచి అటు శ్రీకాకుళం వరకు పర్యటించాను. అన్ని వర్గాల ప్రముఖులు, సామాన్యులతో మమేకమయ్యాను. వారందరి సూచనలు, సలహాలు.. నా విజన్‌ను దృష్టిలో ఉంచుకుని కొత్త పార్టీ ఏర్పాటే సబబు అని నిర్ణయించుకుని ఆ దిశగా అడుగులు వేస్తున్నానని ఇటీవల చెప్పిన రామచంద్ర యాదవ్ తన పార్టీ పేరు వెల్లడించారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial