Mana Mitra Whatsapp Governance:ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. కార్యాలయాలు చుట్టూ తిరిగే ఇబ్బంది లేకుండా తీసుకొచ్చిన మన మిత్ర వాట్సాప్‌ యాప్‌లో సేలు పెంచుతూ వెళ్తున్నారు. ఈ యాప్‌ ద్వారా ఇప్పుడు పింఛన్ సమస్యలు కూడా నివేదించుకోవచ్చు. అధికారుల చుట్టూ తిరగకుండా వాట్సాప్‌లో మెసేజ్ పెట్టి మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు. 

Continues below advertisement


కొత్త పింఛన్ దరఖాస్తు చేసుకోవాలన్నా, అర్హత, పత్రాల అప్‌లోడ్‌, పేరులో మార్పులు చేర్పులు, రికార్డుల్లో ఉన్న సమస్య పరిష్కారం కోసం మన మిత్ర వాట్సాప్‌ యాప్‌ను సంప్రదించవచ్చు. ఇంటి నుంచే కేవలం ఒక వాట్సాప్ మెసేజ్‌తో మీ సమస్యకు పరిష్కారం లభించనుంది. ఇప్పటి వరకు కొత్త పింఛన్ కావాలన్నా, ఉన్న పింఛన్‌లో మార్పులు చేర్పులు జరగాలన్నా కార్యాలయాల చుట్టో, అధికారుల చుట్టో తిరగాల్సి వచ్చేది. ఇకపై అలాంటి వాటికి ఆస్కారం లేదని గ్రామీణ పేదరిక నిర్మూల సొసైటి ప్రకటించింది. 


ఆగస్టు 15 నుంచి ఈ సేవలు ప్రారంభంకానున్నాయి. మన మిత్ర వాట్సాప్ ద్వారా  సేవలు పొందాలంటే ముందుగా మీ మొబైల్‌లో 9552300009 నెంబర్‌ను సేవ్ చేసుకోవాలి. అనంతరం ఆ ఫోన్ నెంబర్‌కు వాట్సాప్ ద్వారా హాయ్ అని మెసేజ్ చేయాలి. అలా చేసిన తర్వాత మీకు ఓ మెసేజ్ వస్తుంది. వాట్సాప్ ద్వారా అందిచే సేవల జాబితాను పంపిస్తారు. అందులో మీకుకావాల్సిన సేవను ఎంచుకోవాల్సి ఉంటుంది. 


మీరు కొత్త పింఛన్ గ్రీవెన్స్‌ అనే సెక్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. అందులో కూడా సాధారణంగా ప్రజలు ఎదుర్కొనే సమస్యల జాబితా ఉంటుంది. వాటిలో మీ సమస్య ఏంటనేది చెప్పాలి. అదర్స్‌ అనేద కాలమ్‌ కూడా ఉంటుంది. మీకు ఇచ్చిన జాబితాలో మీ సమస్య లేకుంటే అదర్స్ క్లిక్ చేసి మీరు ఎదుర్కొనే ఇబ్బంది రాయాల్సి ఉంటుంది. అలా చేసి సబ్‌మిట్ చేయాలి. 


మీరు వాట్సాప్‌లో పెట్టిన మెసేజ్‌ నేరుగా సంబంధిత అధికారులకు ఆటోమేటిక్‌గా వెళ్తుంది. ఇలా వెళ్లిన విషయం కూడా మీకు తెలియజేస్తారు. మీరు పెట్టుకున్న గ్రీవెన్స్‌ స్టాటస్ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కూడా వీలు కల్పించారు. ట్రాక్ చేసుకోవచ్చు.