Law College in Amaravati | కర్నూలు: అమరావతిలో 100 ఎకరాల్లో లా కాలేజ్ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) ప్రకటించారు. న్యాయ శాఖపై సీఎం చంద్రబాబు సోమవారం నాడు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో భాగంగా కర్నూలు (Kurnool)లో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుతో పాటు రాజధాని అవరావతిలో లా కాలేజీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. జూనియర్ లాయర్లకు గౌరవ వేతనం ఇవ్వాలని సమీక్షలో చర్చించారు. జూనియర్‌ లాయర్లకు రూ. 10 వేలు గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెవెన్యూ, ఆర్థిక, పౌరసరఫరాలు, దేవాదాయ శాఖలపై ఫోకస్ చేసిన ప్రభుత్వం తాజాగా న్యాయశాఖకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటున్నారు.