జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సీఎం జగన్‌ను ఉద్దేశిస్తూ ‘పాపం పసివాడు’ అంటూ చేసిన వ్యంగ్యపు ట్వీట్‌కు వైఎస్ఆర్ సీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిజ జీవితంలో హీరో​ అని, ఆయన పాత్రతో సినిమా తీస్తే ఆ సినిమాలో చంద్రబాబును విలన్‌గా నటింప చేయాలని అన్నారు. ఈ సినిమాలో చంద్రబాబుకు 420 అసిస్టెంట్‌గా ఉండాలని అన్నారు. అవసరమైతే ఆ సినిమాకు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ డైరెక్షన్‌ చేస్తారని అన్నారు. రామ్ గోపాల్ వర్మను ఒప్పించడానికి తాను ఆయనతో మాట్లాడతానని చెప్పారు. 


2024 ఎన్నికల తర్వాత సీఎం జగన్‌ ప్రతిపక్ష నేతలందరినీ నడి రోడ్డుపై నిలబెడతారని జోస్యం చెప్పారు. ఎన్నికల తర్వాత పవన్‌కు మిగిలేది ప్యాకేజీ డబ్బులు, సినిమాలే అంటూ కొడాలి నాని కౌంటర్‌ ఇచ్చారు.


Also Read: Telangana News : ఏపీలో ఉండలేం తెలంగాణలో కలపండి - ఆ ఐదు గ్రామాల ప్రజల డిమాండ్ !


సునీల్ దియోధర్ పైనా స్ట్రాంగ్ కౌంటర్స్


ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్ గుడివాడలో చేసిన వ్యాఖ్యలపైన కూడా మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. సునీల్ దియోధర్ ను సునీల్ పకోడి అంటూ ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. ‘‘సునీల్ పకోడీ వాళ్ల వల్లే, కర్ణాటకలో బీజేపీ దిగజారింది. ప్రజలకు ప్రభుత్వ మంచి చెప్పమని పంపితే.. సునీల్ పకోడీ లాంటి వాళ్లు ఇక్కడకు వచ్చి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఫ్లైట్ టికెట్లు, లగ్జరీ రూంలు, కార్లు ఏర్పాటు చేసి పార్టీ కార్యకలాపాల కోసం పంపితే వీళ్లు నాశనం చేస్తున్నారు. ఆ మత విద్వేషాల వల్లే కర్ణాటకలో బీజేపీ ఓడిపోయింది. దేశంలో సునీల్ పకోడీ లాంటి నేతలపై అమిత్ షా, మోదీ దృష్టి పెట్టాలి. లేదంటే కర్ణాటకలో వచ్చిన పరిస్థితే ఇతర రాష్ట్రాల్లో వస్తుంది’’ అని  సునీల్ దియోధర్‌పై కొడాలి నాని కౌంటర్ వేశారు.


సునీల్ దియోధర్ కామెంట్స్ ఇవీ..


కొడాలి నాని సంక్రాంతి పండుగను క్యాసినో, క్యాబిరే డ్యాన్స్‌లుగా మార్చేశారని, గుడివాడ యువతను సర్వనాశనం చేస్తున్నారని బీజేపీ ఏపీ ఇన్‌చార్జ్ సునీల్ దియోధర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గుడివాడ నియోజకవర్గ సమస్యలపై బీజేపీ ఛార్జిషీట్ కార్యక్రమంలో పాల్గొ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే కొడాలి నాని లాంటి వాళ్లను జైలుకు పంపిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని మాటలతో రాష్ట్రం పరువు పోతోందని అన్నారు. గాడిదలా, కుక్కలా బూతులు మాట్లాడుతూ కొడాలి నాని ఫేమస్ అయ్యారని ఆక్షేపించారు. కొడాలి నాని మాటలతో ఏపీ పరువు పోతోందని, ఆయన చేష్టలతో గుడివాడ యువత నాశనం అవుతున్నారని సునీల్ దియోధర్ మండిపడ్డారు. కొడాలి నానిని జీవితాంతం అసెంబ్లీ గడప తొక్కకుండా ప్రజలు వచ్చే ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్పాలని పిలుపు ఇచ్చారు.


Also Read: Andhra News : ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ - మార్గదర్శకాలు రిలీజ్ చేసిన ప్రభుత్వం !