APBJP :   బూతులు మాట్లాడటం ద్వారా గుడివాడ శాసన సభ్యుడు కొడాలి నాని ఫేమస్ అయ్యారని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ సహ ఇంచార్జ్ , జాతీయ కార్యదర్శి సునీల్ దేయోధర్ మండిపడ్డారు.  శిక్ష పడిన ఖైదీ, బూతుల శాసన సభ్యుడి పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయ్యిందని మండిపడ్డారు.  గుడివాడ నియోజకవర్గ సమస్యలపై భారతీయ జనతా పార్టీ చార్జిషీట్  కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సనీల్ ధియోధర్ పాల్గొన్నారు.  శిక్ష పడిన ఖైదీ, బూతుల ఎమ్మెల్యేల పాలనలో రాష్ట్రం అధోగతి పాలయ్యిందని మండిపడ్డారు. ప్రకృతి కారణంగా 45 డిగ్రీల వేడి ని తట్టుకోవాల్సి వస్తుందని, జగన్ పాలనలో అంతకుమించి పది శాతం వేడితో ప్రజలు అలమటిస్తున్నారని వ్యాఖ్యానించారు. 


ప్రభుత్వ అరాచక వాదులు, అవినీతిపరులు రాష్ట్రంలో అన్నింటిని మింగేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యేలు దోచుకున్న డబ్బును తాడేపల్లి ప్యాలెస్ కు పంపుతున్నారన్నారు. ఇసుక, మద్యం, గంజాయి మాఫియాలదే ఆంధ్రప్రదేశ్ లో రాజ్యమని అన్నారు. ఆలీబాబా 40 దొంగలు మాదిరి జగన్ ప్రభుత్వ పాలన ఉందని ఎద్దేవ చేశారు.అవినీతి జగన్ పాలనను అంతం చేసేందుకు జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి పోరాడుతాయని స్పష్టం చేశారు. 


లూటీలు, అరాచకాలు చేస్తున్న జగన్ ప్రభుత్వం పై క్రిమినల్ చార్జ్ షిటు వెయ్యాలని నిర్ణయించామని ప్రకటించారు.  గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని  బూతులు మాట్లాడుతూ ఫేమస్ అయ్యారని ఎద్దేవా చేశారు. స్దానిక శాసన సభ్యుడు కొడాలి నాని  మాటలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు పోతుందని అన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి  వచ్చిన మరుక్షణం క్రైస్తవ, ముస్లింలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే కార్యక్రమాలను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. హిందూ దేవాలయాల డబ్బుతో పాస్టర్లు, మౌజాన్లకు డబ్బు పంచుతున్నారని, అభ్యంతరం తెలిపార చర్చిలు ,మసీదుల నుండి దేవాలయాల్లో మాదిరి ప్రభుత్వం డబ్బులు వసూలు చేయాలని డిమాండ్ చేశారు.


19న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం


ఈనెల 19వ తేదీ  శుక్రవారం భారతీయ జనతా పార్టి రాష్ట్ర కార్యవర్గ  సమావేశాన్ని కృష్ణాజిల్లా  గన్నవరం లో నిర్వహించాలని నిర్ణయించారు.  సోము వీర్రాజు అధ్యక్షతన జరిగే సమావేశానికి పార్టీ జాతీయ సహ సంఘటనా ప్రధాన కార్యదర్శి  శివ ప్రకాష్ , కేంద్ర మంత్రి, రాష్ట్ర పార్టీ ఇంచార్జ్  వి. మురళీధరన్,  రాష్ట్ర పార్టీ సహ ఇంచార్జ్  సునీల్ దేవధర్ తదితర జాతీయ,  రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలు పాల్గొనను న్నారు. రాష్ట్ర పదాధికారులు, జిల్లా  అధ్యక్షులు, జిల్లా ఇన్చార్జులు, వివిధ మోర్చాల రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, వివిధ అనుబంధ విభాగాల రాష్ట్రస్థాయి బాధ్యులు & అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్లు & జాయింట్ కన్వీనర్లు ఇతర ఆహ్వానితులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రధాన మంత్రి  నరేంద్ర మోడీ  తొమ్మిది సంవత్సరాల పాలన విజయవంతంగా ఈనెల 30 తేదీకి పూర్తి అవుతున్న సందర్భంగా  మే   30వ తేదీ నుండి  నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న కార్యక్రమాల గురించి చర్చించనున్నారు. రాష్ట్రంలో పార్టీ చేపట్టిన ప్రజా ఉద్యమాలపై సమీక్ష, వైసిపి ప్రభుత్వ అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న చార్జిషీట్ ఉద్యమం ,రానున్న రోజుల్లో పార్టీ చేపట్టవలసిన కార్యక్రమాల రూపకల్పన అంశాలు పై చర్చ జరగనుంది.