KA Paul: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pavan Kalyan) పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఏ.(K.A.Paul) పాల్ మరోసారి సంచలన ఆరోపణలు చేశాడు. పవన్ తెలుగుశం పార్టీకి అమ్ముడుపోయాడని తాను గతంలోనే చెప్పానని...ఇప్పుడు అదే నిజమైందన్నారు. పవన్ 25 సీట్లకు అమ్ముడుపోతాడని తాను ఇప్పటికే వందసార్లు చెప్పనన్నారు. తెలుగుదేశం తాను చెప్పిన దానికన్నా ఒకటి తగ్గించే ఇచ్చిందన్నారు.


కె.ఏ.పాల్ కామెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ వాలిపోయి హడావుడి చేయడం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఏ.పాల్(K.A.Paul) కు రివాజు. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు జరుగుతుండటంతో అక్కడే మకాం వేసిన పాల్...కీలక నేతలపై రోజుకొక కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తెలుగుదేశం(TDP)-జనసేన(Janasena) పొత్తుపై గతంలోనే కీలక వ్యాఖ్యలు చేసిన పాల్....వారిది అనైతిక పొత్తు అంటూ మండిపడ్డారు. పవన్ కల్యాణ్(Pavan Kalyan) తనతో చేతులు కలిపితే ఆయన్ను సీఎం కుర్చీపై కుర్చోపెడతానంటూ  బంపర్ ఆఫర్ ఇచ్చారు.దీనిపై పవన్ స్పందించకపోవడంతో ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలుగుదేశానికి (TDP)అమ్ముడు పోయాడని ఫ్యాకేజీ స్టార్ అంటూ  మండిపడ్డారు. పవన్ కు పాతిక సీట్లు మించి ఇవ్వరంటూ జోస్యం చెప్పారు. దీనిపై జనసైనికులు సైతం ఆయన్ను ఆడేసుకున్నారు.


చంద్రబాబు మూర్ఖుడేం కాదు
తెలుగుదేశం- జనసేన సీట్ల పంపకం కొలిక్కి వచ్చింది. జనసేన(Janasena) మొత్తం 24 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంట్ సీట్లలో పోటీ చేయనుందని శనివారం స్వయంగా  పవన్ కల్యాణ్ ప్రకటించారు. అంతే కాదు కూటమి తరపున 99మంది అభ్యర్థులను ప్రకటించారు. అందులో ఐదుగురు జనసైనికులు సైతం ఉన్నారు. దీనిపై మరోసారి కే.ఏ. పాల్(K.A.Paul) స్పందించారు. తాను ముందు నుంచీ చెబుతున్నట్లే  జనసేకు పాతిక సీట్లు కూడా ఇవ్వలేదని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పుడు స్వయంగా పవన్ కల్యాణే ప్రకటన చేశారన్నారు. తాను చెబుతున్నా  పవన్ సన్నిహితులు మాత్రం జనసేనకు  50 సీట్లు ఇవ్వడంతో పాటు సగం రోజులు ముఖ్యమంత్రిని చేయాలంటూ ప్రతిపాదనలు చేశారని పాల్ గుర్తుచేశాడు. జనసేనకు అన్నన్ని సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రిని చేయడానికి చంద్రబాబే ఏం మూర్ఖుడు కాదని...రాజనీతజ్ఞుడని అన్నారు. ఆయనకు ఎవరిని ఎలా ఉపయోగించకోవాలో తెలుసన్నారు. అయితే తెలుగుదేశం ప్రకటించిన తొలిజాబితాలోనూ బీసీ(BC)లకు అన్యాయం జరిగిందన్నారు. బీసీల పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం కనీసం వారికి సగం సీట్లు కూడా ఇవ్వలేదన్నారు. ప్రజల్లో 57శాతం ఉన్న బీసీలు, 27శాతం ఉన్న కాపులు మేల్కోవాలన్నారు. ప్రజాశాంతిపార్టీలో బీసీలకే అవకాశం ఇస్తామన్న కె.ఏ.పాల్...పార్టీలో చేరాలని, అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. పవన్ కల్యాణ్ నమ్ముకుంటే జనసైనికులను ఆయన నట్టేట ముంచడం ఖాయమన్నారు. పదేళ్లకు పైగా పార్టీ జెండాను మోస్తున్న వారికి పవన్ ఏం సమాధానం చెబుతారన్నారు.కేవలం 25 సీట్లలో పోటీ చేస్తే..మిగిలిన ప్రాంతాల్లో ఇప్పటి వరకు మీ వెంట నడిచిన అభిమానులు, కార్యకర్తలు ఏం కావాలన్నారు. మిమ్మల్ని నమ్ముకుని కోట్లాది రూపాయలు ఖర్చు చేసుకున్న నేతలకు ఏం సమాధానం ఇస్తారన్నారు. పవన్ కల్యాణ్ విషయంలో తాను మొదటి నుంచీ చెబుతున్నది నిజమే అవుతోందన్నారు. ఇప్పటికైనా జనసేన కార్యకర్తలు ఆయన మాటలు నమ్మవద్దని కె.ఏ.పాల్ సూచించారు.