Chandrababu Shirdi Tour: షిరిడీ సాయి సన్నిధిలో చంద్రబాబు దంపతుల పూజలు

Chandrababu Devotional Trip : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎన్నికల ఒత్తిడి నుంచి రిలాక్స్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆధ్యాత్మిక పర్యటన చేస్తున్నారు.

Continues below advertisement

TDP Chief Chandrababu Naidu: సార్వత్రిక ఎన్నికల మహా సంగ్రామం ముగిసింది. ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నేతలు ఎన్నికలు జరిగిన తీరు, ఫలితాలకు సంబంధించిన విశ్లేషణలు సాగిస్తున్నారు. గడిచిన రెండు నెలలు నుంచి ప్రచారంలో బిజీగా గడిపిన ప్రధాన పార్టీలకు చెందిన అధినేతలు ఇప్పుడు రిలాక్స్‌ అవుతున్నారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి కొద్దిరోజుల్లో లండన్‌ టూర్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కోర్టు అనుమతి కూడా ఆయన తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబానాయుడు కూడా ఎన్నికల ప్రచార ఒత్తిడి నుంచి బయటపడుతున్నారు. ఎన్నికలు జరిగిన తీరు, ఓటింగ్‌పై సమీక్ష నిర్వహించిన ఆయన.. గురువారం ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్లారు. మహరాష్ట్ర పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు.. అదే ప్రాంతంలోని కొల్హాపూర్‌ మహలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సతీ సమేతంగా సందర్శించారు.

Continues below advertisement

ఆలయంలో చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం షిరిడీ వెళ్లిన ఆయన అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు చంద్రబాబు దంపతులకు జ్ఞాపికను అందించారు. 

 

Continues below advertisement
Sponsored Links by Taboola