AP Mega DSC Jobs 2025 | అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ  నోటిఫికేషన్‌కు భారీగా స్పందన లభించింది. మొత్తం 3 లక్షల 35 వేల 401 మంది అభ్యర్థులు మెగా డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్నారు. గురువారం అర్ధరాత్రి దరఖాస్తు గడువు ముగిసింది. మెగా డిఎస్పీలో 16,347 పోస్టులను ఏపి ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ మొత్తం పోస్టులకుగానూ 5 లక్షల 77 వేల 417 అప్లికేషన్లు వచ్చాయి. 

Continues below advertisement

ఇతర రాష్ట్రాల నుంచి 7159 మంది దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో 39,997 మంది దరఖాస్తు చేసుకున్నారు. అత్యల్పంగా ఉమ్మడి కడప జిల్లా నుంచి 15వేల ఎనిమిది వందల పన్నెండు మంది అభ్యర్థులు డిఎస్సి పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. మే నెలాఖరు నుంచి హాల్ టికెట్లు జారీ చేయాలని విద్యాశాఖ చర్యలు చేపట్టింది. జూన్ 6న ప్రారంభం కానున్న కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జూలై ఆరో తేదీన ముగియనున్నాయి.

 

 

జిల్లా పేరు

అభ్యర్థులు

దరఖాస్తులు
1

శ్రీకాకుళం

22,648

39,235
2 విజయనగరం 18,001  31,038
3 విశాఖపట్నం  29,779  49,658
4 తూర్పు గోదావరి  38,617  63,004
5 పశ్చిమ గోదావరి  25,750   42,466
6 కృష్ణా  19,953   35,220
7 గుంటూరు   25,067   43,570
8 ప్రకాశం  21,046   35,095
9 నెల్లూరు   15,993   28,772
10 చిత్తూరు    26,501    45,221
11 కడప    15,812  29,915
12 కర్నూలు    39,997    73,605
13 అనంతపురం    29,078    50,475
14 ఇతర రాష్ట్రాల వారు  7,159     10,143

మే 20 నుంచి మెగా డీఎస్సీ అభ్యర్థులకు మాక్‌ టెస్టులు అందుబాటులోకి రానున్నాయి. మే 30 నుంచి అభ్యర్థులు హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అన్ని పరీక్షలు పూర్తయిన రెండో రోజే ప్రాథమిక కీ విడుదల చేయనుంది విద్యాశాఖ. ఆ తర్వాత 7 రోజుల పాటు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించనుంది. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన వారం రోజుల తర్వాత ఏపీ మెగా డీఎస్సీ ఫైనల్‌ కీ విడుదల చేస్తారు. ఫైనల్‌ కీ విడుదల చేసిన 7 రోజుల తర్వాత ఏపీ డీఎస్సీ ఫలితాలు మెరిట్ జాబితా విడుదల చేస్తారు. తరువాత సర్టిఫికెట్ వెరిఫికేట్ వెరిఫికేసన్ ప్రక్రియ పూర్తిచేసి, రిజర్వేషన్, మెరిట్ ఆధారంగా ఆయా పోస్టులకుగానూ అభ్యర్థుల తుది ఎంపిక పూర్తి చేసి ఫలితాలు ప్రకటించనున్నారు.