AP CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలగపూడిలోని సచివాలయంలో సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం జూన్ 13 సాయంత్రం 4.41 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్ లోని ముఖ్యమంత్రి కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు సంబంధిత దస్త్రంపై సంతకం చేసి అధికారికంగా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకున్నారు.




ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా 5 కీలక ఫైళ్లపై చంద్రబాబు సంతకాలు చేశారు.


1. మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు.


2. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై రెండో సంతకం


3. పింఛను రూ.4 వేలకు పెంచుతూ మూడో సంతకం


4. స్కిల్ సెన్సెస్


5. అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై సంతకాలు


అంతకుముందు చంద్రబాబు తన కాన్వాయ్‌లో ఉండవల్లిలోని నివాసం నుంచి బయలుదేరారు. మందడం గ్రామం మీదుగా సచివాలయం చేరుకున్నారు. ఈ మార్గమధ్యలో రోడ్లపై దారి పొడవునా అమరావతి రైతులు పూలు చల్లి స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చంద్రబాబు కాన్వాయ్‌తో పాటు వచ్చారు. అందరికీ ముఖ్యమంత్రి అభివాదం చేస్తూ వచ్చారు. కాన్వాయ్ వెంట ద్విచక్రవాహనాల్లోనూ చాలా మంది గ్రామ ప్రజలు వచ్చారు. మరికొంత మంది కాన్వాయ్ కు ఎదురు వెళ్లి చంద్రబాబుకు నమస్కరించారు.