ఆంధ్రప్రదేశ్ ను జాతీయ డిజిటల్ టూరిజం మిషన్ టాస్క్ ఫోర్స్ లో సభ్య రాష్ట్రంగా కేంద్రం ఎంపిక చేసినట్లు రాష్ట్ర
పర్యాటక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తెలిపారు. పర్యాటక రంగంలో డిటిలైజేషన్ తో పాటు మార్కెట్ విస్తరణ, నిర్వహణ,
సామర్థ్యాలు పెంపు, పర్యాటక రంగంలో మరిన్ని అవకాశాలను మెరుగుపర్చేందుకు ఈ టూరిజం టాస్క్ ఫోర్స్ అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. పర్యాటక రంగంలో రవాణా, ఎదురవుతున్న సవాళ్లపై అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. ఆతిథ్యరంగం, ఆహార సేవలు, రవాణా అంశాలపై కూడా నివేదిక ఇవ్వనున్నారు.
ఈ టాస్క్ ఫోర్స్ ముఖ్య ఉద్దేశం జాతీయ, రాష్ట్ర పర్యాటక సంస్థలు, విభాగాలను డిజిటలైజేషన్ ప్రక్రియ, పర్యాటక రంగ అభివృద్ధి, ఇతర సమస్యలపై అధ్యయనం చేయనుంది. ఈ టాస్క్ ఫోర్స్ మూడు నెలల్లో తమ నివేదికను అందించనుందని రజత్ భార్గవ్ తెలిపారు.
పర్యాటక రంగ అభివృద్ధికి ఉన్న మార్గాలను అన్వేషించడంతో పాటు, సమస్యల పరిష్కరానికి సూచనలు చేయనుందన్నారు. ఈ మిషన్ ముఖ్య ఉద్దేశం పర్యటక రంగంలో మరిన్ని అవకాశాలకు మార్గాలు, ప్రత్యేక ప్రణాళికలు రచించనుంది. ముఖ్యంగా పర్యాటకాన్ని డిజిటలైజేషన్ వైపు పరుగులు పెట్టించే విధంగా ప్రణాళికలు రచించనుంది. కోవిడ్ ప్రభావంతో కుదేలైన పర్యాటక రంగాన్ని గాడిలో పెట్టేందుకు ఈ టాస్క్ ఫోర్స్ సూచనలు చేయనుంది. పర్యాటక రంగంలో పూర్వ పరిస్థితి తీసుకువచ్చేందుకు కేంద్రం ఈ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసిందని రజత్ భార్గవ తెలిపారు.
పర్యాటక రంగంలో డిజిటలైజేషన్ వృద్ధి, సంస్థల మార్కెట్ విస్తరణ, అభివృద్ధి కార్యాచరణ, సామర్థ్యాలను విస్తరించే అవకాశాలను పెంచడం టాస్క్‌ఫోర్స్ యొక్క ముఖ్యమైన లక్ష్యం. ట్రావెల్, హోటల్, క్యాటరింగ్, టూరిజంతో సంబంధం ఉన్న ఇతర సేవా రంగాలలో డిజిటలైజేషన్ కోసం కీలక సవాళ్లు, అవకాశాలను గుర్తించడం కూడా టాస్క్ ఫోర్స్ లక్ష్యం. టాస్క్‌ఫోర్స్ తన నివేదికను మూడు నెలల్లో సమర్పించాల్సి ఉంది. డిజిటలైజేషన్ తో జాతీయ, రాష్ట్ర పర్యాటక సంస్థలు, సర్వీస్ ప్రొవైడర్లు, పర్యాటక ప్రదేశాలు, ఉత్పత్తులు విస్తరించి పర్యాటక రంగంలో సమాచారం, సేవల మార్పిడిని సులభతరం చేయనుంది.
పర్యటక రంగంలో డిజిటలైజేషన్ దిశగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ తెలిపింది. దీని వల్ల విభాగాలలో పర్యాటకాన్ని పెంచే అవకాశాన్ని ఏర్పడిందని ఏపీ పర్యాటక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ చెప్పారు. ఐదుగురు రాష్ట్ర ప్రతినిధులు సభ్యులుగా ఉండే టాస్క్ ఫోర్స్‌కు కేంద్ర పర్యాటక కార్యదర్శి నేతృత్వం వహిస్తారు. టాస్క్ ఫోర్స్ పర్యాటక, పర్యావరణ వ్యవస్థలో డిజిటల్ మిషన్, డొమైన్, టెక్నాలజీ సూత్రాల కోసం ప్రధాన వాటాదారులను గుర్తిస్తుంది. అధిక ప్రాధాన్యత, అధిక ప్రభావం ఉన్న డొమైన్ ప్రాంతాలను జాబితాను కూడా రూపొస్తుంది. అలాగే పర్యాటక రంగంలో డిజిటలైజేషన్‌ను ప్రోత్సహించడానికి మౌళిక సదుపాయాలు, వ్యూహాలను కూడా ప్రతిపాదిస్తుంది.
Also Read:Pegasus Spyware: 'పెగాసస్' వ్యవహారంపై విచారణకు సుప్రీం ఓకే