Balakrishna About Theaters Movie Industry Issue In APFDC Team Oath Event : సినీ ఇండస్ట్రీకి ఓ రాజధానిగా ఏపీ మారుతుందని... 70 శాతం సినిమా కలెక్షన్స్ వచ్చేది ఏపీ నుంచేనని ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య అన్నారు. ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, డైరెక్టర్స్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మూవీ ఇండస్ట్రీ, ఎగ్జిబిటర్స్, థియేటర్స్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 

Continues below advertisement

'వారిని చూస్తే జాలేస్తుంది'

'షూటింగ్స్ లేక ఎన్నో యూనియన్స్‌కు పనులు లేవు. సినిమా ఎలా ఉండాలో ఆలోచించాల్సింది పోయి... బ్రతికించాల్సిన పరిస్థితి వచ్చింది. టెక్నిక్ లేనప్పుడు మూవీస్ త్వరగా పూర్తయ్యేవి. టెక్నిక్ పెరిగాక మరింత లేట్ అవుతున్నాయి. చాలా మంది ఎగ్జిబిటర్స్‌ను చూస్తే చాలా బాధగా ఉంది.

Continues below advertisement

థియేటర్స్‌కు తాళాలు వేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. జోడెడ్ల ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని డెవలప్ చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వ సహకారం కోరుతున్నాం. ఏపీలో తెలుగు సినీ ఇండస్ట్రీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది.' అని బాలకృష్ణ (Balakrishna) అన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

Also Read : ట్రెండింగ్‌లో హల్లల్లల్లో ఐటెం సాంగ్ - ఎనర్జిటిక్ స్టెప్స్ విత్ రొమాంటిక్ టచ్ లిరిక్స్

సరికొత్త అధ్యాయం

ఏపీ చరిత్రలో ఇది సరికొత్త అధ్యాయమని... సీఎం చంద్రబాబు, తమ్ముడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నేను, మంత్రి దుర్గేష్ కలిసి FDC ఏర్పాటు చేసినట్లు చెప్పారు బాలయ్య. 'సినీ ఇండస్ట్రీకి ఏపీ రాజధానిగా మారుతుంది. 70 శాతం కలెక్షన్స్ వచ్చేది ఏపీ నుంచే. అఖండ సినిమా కూడా రంపచోడవరంలో చేశాం. నేను చేసినన్ని సినిమాలు ఏపీలో ఎవరూ చేసి ఉండరు. 

సినిమా నేపథ్యాలు అన్నీ ఏపీలో అద్భుతమైనవి ఉన్నాయి. షూటింగ్స్ నిరాటంకంగా జరగడానికి అన్నీ పర్మిషన్స్ ఒకే గొడుగు కిందక దొరికేలా సింగిల్ విండోలో రావాలి. అన్నీ అంశాలపై త్వరలోనే ఓ కార్యాచరణ తెలియజేస్తాం.' అని చెప్పారు.

APFDC ఛైర్మన్, డైరెక్టర్స్ ప్రమాణ స్వీకారం

ఏపీ FDC (APFDC) నూతన ఛైర్మన్‌గా ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ భరత్ భూషణ్‌ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, వైస్ ఛైర్మన్ సహా 20 మంది డైరెక్టర్స్‌ను నియమించింది. వీరంతా సినీ రంగానికి చెందిన వారే కావడం విశేషం. వైస్ ఛైర్మన్‌గా డైరెక్టర్ మెహర్ రమేష్ నియమితులయ్యారు.

ప్రముఖ నటుడు శివాజీ, సుమన్, యాంకర్ ఝాన్సీ, సీనియర్ ప్రొడ్యూసర్ చదలవాడ శ్రీనివాసరావు, కూచిబొట్ల సుబ్రమణ్యం, రైటర్ సాయిమాధవ్ బుర్రా, డైరెక్టర్ సముద్ర, సీనియర్ జర్నలిస్ట్ కె ఉమా మహేశ్వరరావు, సినిమాటోగ్రాఫర్ ఎస్ మీర్ డైరెక్టర్స్‌గా అపాయింట్ అయ్యారు. విజయవాడలోని ఎన్టీఆర్ అడ్మినిస్టేటివ్ బ్లాక్‌లోని FDC ఛైర్మన్‌గా వీరు ప్రమాణ స్వీకారం చేశారు. అటు, తెలంగాణలో FDC ఛైర్మన్‌గా ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొనసాగుతున్నారు. ఇంకా డైరెక్టర్స్‌ను నియమించలేదు.

Also Read : జన నాయగన్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు నోటిఫికేషన్స్... సీఎం బర్త్ డేకు డబుల్ ట్రీట్