Ram Charan's Peddi Hellallallo Song Telugu Lyrics : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది నుంచి ఐటెం సాంగ్ ఫుల్ వీడియో వచ్చేసింది. చరణ్‌తో పాటు శ్రుతి హాసన్ జాన్వీ కపూర్ ఎనర్జిటిక్ స్టెప్స్ జోష్ పెంచేస్తున్నాయి. ఇప్పటికే రిలీజైన రెండు సాంగ్స్ మించి ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ వేరే లెవల్. ఈ పాటకు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించగా... రక్షిత సురేశ్ పాడారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. రొమాంటిక్ టచ్ ఉండేలా ఉన్న ఐటెం సాంగ్ లిరిక్స్ ఓసారి చూస్తే... 

Continues below advertisement

పల్లవి 

Continues below advertisement

బారులుంటాయ్ బంకులుంటాయ్ బంగారాలుంటాయ్...

బాధలుంటాయ్.. బాకీలుంటాయ్... భారాలుంటుంటాయ్... 

మనిషన్నవోడికివి మామూలే... ప్రతిపూట తప్పని పేచీలే... 

అడపాదడపా ఇడిసెయ్ గడపా... ఏటి పీపీలయిపోతావ్ అతిగా...

వారానికి వెయ్యి... నాకోసం దాయి... నెలకోసారైనా నీకిత్తా ఈ హాయి...

అరకాసులు తియ్యి... అరవంకీలేయి... స్వర్గానికి దారి చూపిత్తాం వచ్చేయి...

అందం బిందులున్నాయ్ దా దా దా... ఆలోచిత్తా పోతే ఆలస్యం అయిపోదా...

హల్లల్లల్లో హల్లో హల్లల్లల్లో హల్లల్లో...

బావా చీర చొక్కా చిక్కడిపోవాలో...

హల్లల్లల్లో హల్లో హల్లల్లల్లో హల్లల్లో...

బావా సిగ్గు గట్రా నొక్కడిపోవాలో... 

చరణం 1 

ఇంట్లో వంటే తింటుంటావా... 

హోటల్‌కో దాబాకో ఓసారెల్లిముద్ద మింగి రావా... 

హే ఇంట్లో తానం సాలంటావా... 

పండక్కో పబ్బంకో ఏట్లోకెళ్లో మునక మనిగి రావా... 

ఇది కూడా అంతేరో... ప్రతివారం సంతేరో... 

అది కూడా వగ్గేత్తే  పుట్టిందింకెందుకురో... 

హల్లల్లల్లో హల్లో హల్లల్లల్లో హల్లల్లో... 

బావా చీర చొక్కా చిక్కడిపోవాలో... 

చిక్కడి పోవా చిక్కడి పోవా చిక్కడి పోవాలో..

బావా చీర చొక్కా చిక్కడిపోవాలో... 

చరణం 2 

నెమరేసుకోనాకైనా... వివరీసు లేకుంటే ఎల్గా... ఎల్గా...

ఎనకూళ్లోఅననాకైనా వేశాలేవీ లేకుంటే ఎల్గా... అల్గా...

సుఖమిట్టా పోగెసెయ్... ఇప్పుడే అది ఎనకేసెయ్... 

ముసలాడైపోయాక మురిపెంగా నెమరేసెయ్... 

హల్లల్లల్లో హల్లో హల్లల్లల్లో హల్లల్లో...

బావా చీర చొక్కా చిక్కడిపోవాలో... 

హల్లల్లల్లో హల్లో హల్లల్లల్లో హల్లల్లో... 

బావా సిగ్గు గట్రా నొక్కడిపోవాలో... 

వారానికి వెయ్యి... నాకోసం దాయి...

నెలకోసారైనా నీకిత్తా ఈ హాయి...

అరకాసులు తియ్యి... అరవంకీలేయి...

స్వర్గానికి దారి చూపిత్తాం వచ్చేయి...

అందం బిందులున్నాయ్ దా దా దా...

ఆలోచిత్తా పోతే ఆలస్యం అయిపోదా...

హల్లల్లల్లో హల్లో హల్లల్లల్లో హల్లల్లో...

 
బుచ్చిబాబు దర్శకత్వం వహించిన మూవీలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ, అజయ్ ఘోష్, రంగస్థలం మహేశ్, జగపతిబాబు తదితరులు కీలకపాత్రలు పోషించారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించగా... జూన్ 4న వరల్డ్ వైడ్‌గా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.