Thalapathy Vijay's Jana Nayagan Release Date Locked : కోలీవుడ్ స్టార్, తమిళనాడు సీఎం విజయ్ ఫ్యాన్స్‌కు బిగ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న దళపతి లాస్ట్ మూవీ జన నాయగన్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కొత్త డేట్ వైరల్ అవుతోంది.

Continues below advertisement

విజయ్ బర్త్ డే స్పెషల్‌గా

జూన్ 22న విజయ్ బర్త్ డే స్పెషల్‌గా అంతకు ముందే ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్ ఇచ్చేలా జూన్ 19న థియేటర్లలోకి 'జన నాయగన్' రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 'డిస్ట్రిక్ట్' ఆన్లైన్ టికెట్ బుకింగ్ యాప్‌లో డేట్ వచ్చేసింది. తమిళం, తెలుగు భాషల్లో మూవీ రిలీజ్ కానున్నట్లు ఫ్యాన్స్‌కు నోటిఫికేషన్స్ రాగా... వీటిని స్క్రీన్ షాట్స్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Continues below advertisement

ఒకవేళ ఈ డేట్ నిజమైతే విజయ్ బర్త్ డే ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ అనే చెప్పాలి. ఓవైపు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్ డే, మరోవైపు ఎంతోకాలంగా వెయిట్ చేస్తున్న మూవీ రిలీజ్ కావడం వారికి ఫుల్ జోష్ ఇస్తుంది. మరి మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడు చేస్తారో వెయిట్ చేయాల్సి ఉంది.

Also Read : వింత సింబల్‌తో దారుణ హత్యలు - బొటన వేలిస్తే తీరే కోరికలు... ఓటీటీలో ట్రెండింగ్ హారర్ క్రైమ్ థ్రిల్లర్

నిజానికి సంక్రాంతికే రిలీజ్ కావాల్సిన మూవీ సెన్సార్ వివాదాలతో వాయిదా పడింది. ఆ తర్వాత నిర్మాతలు కోర్టులు మెట్లెక్కినా రివైజింగ్ కమిటీ వద్దే తేల్చుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో సినిమాను రివ్యూ కోసం కమిటీకి పంపారు మేకర్స్. ఆ తర్వాత దీనిపై ఎలాంటి అప్డేట్ లేదు. తాజాగా... ఆలయ దర్శనం కోసం వచ్చిన నిర్మాత వెంకట్ కె నారాయణ సెన్సార్ ఇంకా కాలేదని చెప్పారు. త్వరలో సమస్య పరిష్కరించి సినిమా రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు.

మరోవైపు, రిలీజ్‌కు ముందే సినిమా లీక్ కావడం అటు మేకర్స్‌తో పాటు ఇటు ఫ్యాన్స్‌కు కూడా ఆందోళన కలిగించింది. ఆన్ లైన్‌లో HD పైరసీ ప్రింట్ లీక్ కావడంతో మేకర్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన అధికారులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. నెట్టింట పైరసీ లింక్ తొలగించే చర్యలు చేపట్టారు. టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకూ స్టార్ హీరోస్... మేకర్స్‌కు అండగా నిలిచారు. తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో ఘన విజయం సాధించిన విజయ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మూవీ రిలీజ్‌కు రెడీ అవుతోంది.

ఈ మూవీలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు. మమితా బైజు కీలక పాత్ర పోషించారు. ప్రకాష్ రాజ్, ప్రియమణి, బాబీ డియోల్, గౌతమ్ మీనన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మించారు.

Also Read : శక్తిమాన్‌గా అల్లు అర్జున్ - మలయాళ స్టార్ డైరెక్టర్‌తో మూవీ... క్లారిటీ వచ్చేసింది

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.