AP High Court News: ఏపీ ప్రభుత్వానికి హై కోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. బెస్ట్ అవైలబుల్ స్కూళ్లను అర్ధాంతరంగా రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుత విద్యార్థుల పదో తరగతి పూర్తయ్యే వరకూ స్కూళ్లను కొనసాగించాలని ఆదేశించింది. మాల మహానాడు నేతలు ప్రభుత్వం తీసుకున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ (Best Available Schools Scheme) నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో (AP High Court News) పిటిషన్ వేశారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల్లో ప్రతిభ కనబర్చిన వారికి కార్పొరేట్ స్కూళ్లలో చదువు కోసం ప్రభుత్వం ఈ పథకం ఉన్న సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ఒకటి, ఐదో తరగతుల విద్యార్థులను సాంఘిక సంక్షేమ శాఖ చేర్చుతోంది.  1995లో ప్రవేశ పెట్టిన ఈ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. పిల్లల విద్య కొనసాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు తాజాగా హైకోర్టు (AP High Court Orders) ఆదేశాలు జారీ చేసింది.


కోర్టు ఉల్లంఘన కింద ఆగ్రహం
మరో కేసు విషయంలో హై కోర్టు (AP High Court News) ఆదేశించినా కేసులో విచారణకు హాజరు కాని, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.జవహా రెడ్డిపై (K Jawahar Reddy IAS)  హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏదో సమావేశం ఉందని కోర్టుకు హాజరు కావడం మానుకుంటారా? అని ప్రశ్నించింది. కనీసం కోర్టుకు హాజరయ్యే సమయం కూడా లేదా అంటూ నిలదీసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సమావేశాల్లోనే పాల్గొంటారా అంటూ ప్రశ్నించింది.


ఆ మేరకు రోజులకు ఎన్నిగంటలు మీటింగుల్లో పాల్గొంటారో సీఎం పేషీ నుంచి నివేదిక తెప్పించుకొని చూస్తాం అని చెప్పింది. స్వాతంత్ర్య సమర యోధులు గాంధీ, బాలగంగాధర్‌ తిలక్‌ తదితర మహోన్నతులే కోర్టుల ఆదేశాలను గౌరవించారని, మీరు అంతకన్నా గొప్పవారా? అంటూ  హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు గురువారం ఈ వ్యాఖ్యలు చేశారు.


ఆయన తన హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఐఏఎస్‌ జవహర్‌రెడ్డి (K Jawahar Reddy IAS) దాఖలు చేసిన అఫిడవిట్ లో సమావేశం ఎన్ని గంటలకు ప్రారంభమై ఎప్పటికి ముగుస్తుందనే కనీస వివరాలు లేవని తప్పుబట్టింది. భవిష్యత్తులో కోర్టు ఆదేశాలను అమలు చేయలేదని న్యాయస్థానం గుర్తిస్తే వివరణ తీసుకోకుండానే నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. దయచేసి న్యాయస్థానం ఆదేశాలను పాటించకపోతే ఏమీ కాదులే అనే భావనతో ఉండొద్దని హితవు పలికింది.