Chandrababu First Sign on Five Files: ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలోని మొదటి బ్లాకులో సీఎం కార్యాలయంలో చంద్రబాబు జూన్ 13 సాయంత్రం 4.41 గంటలకు బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా తొలి సంతకం మెగా డీఎస్సీపైనే చేశారు. దీంతోపాటు మరో నాలుగు ఫైళ్లపైన సీఎం చంద్రబాబు సంతకాలు చేశారు.
తొలి సంతకం మెగా డీఎస్సీకి మార్గం సుగమం చేసే ఫైలుపై చేయగా.. రెండో సంతకం ల్యాండ్ టైటలింగ్ రద్దుపై చేశారు. గత వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టం ప్రజల్లో భయాందోళనలను కలిగించిన సంగతి తెలిసిందే. దీంతో తాను అధికారంలోకి రాగానే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను రద్దు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
సామాజిక పెన్షన్ లను రూ.4 వేలకు పెంచుతూ తయారు చేసిన ఫైలుపై చంద్రబాబు మూడో సంతకం చేశారు. వృద్ధాప్య పింఛన్లు తాను అధికారంలోకి రాగానే రూ.4 వేలు చేస్తానని చెప్పగా.. ఆ ప్రకారం ఈ సంతకం చేశారు.
ఇక నాలుగో సంతకం అన్నా క్యాంటీన్ లను పునరుద్దరణ ఫైలు పైన.. ఐదో సంతకం స్కిల్ డెవలప్ మెంట్ సైన్సెస్ ఫైల్ పైన చేశారు.