గ్యాస్‌ సిలిండర్‌ ధర సామాన్యులకు భాగంగా మారింది. దీనికి తోడు డెలివరీ ఛార్జీలు కూడా గుంజుతుంటారు. సిలిండర్‌ ఇంటికి తెచ్చిస్తే... ఎంతో కొంత డబ్బు అదనంగా  చెల్లించాల్సిందే. లేదంటే... గొణుగుతూనే ఉంటారు డెలివరీ బాయ్స్‌. అంతేకాదు.. ఇల్లు పైఫోర్‌లో ఉందంటే... ఇంక అంతే సంగతులు. దానికి కూడా అదనంగా చెల్లించాల్సిందే.  లేదంటే ఊరుకోరు. కానీ ఇకపై... అలా కుదరుదు. గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ చేసిన తర్వాత గ్యాస్‌ డెలివరీ బాయ్‌ అదనపంగా డబ్బు అడిగితే కఠిన చర్యలు తప్పవని  హెచ్చరించింది ఏపీ పౌరసరఫరాల శాఖ. రశీదులో ఉండే మొత్తానికి మించి ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని ప్రజలకు స్పష్టం చేశారు ఏపీ  పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ హెచ్‌. అరుణ్‌కుమార్‌. 


ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్‌ సెంటర్‌ నుంచి 15 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలు, గిరిజన, కొండ ప్రాంతాలకు ఎలాంటి డెలివరీ చార్జీలు తీసుకోవడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. ఒకవేళ  తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అదనపు డబ్బులు అడిగిన డెలివరీ బాయ్స్‌పై ఫిర్యాదు చేయడానికి టోల్‌ఫ్రీ నెంబర్‌ 1967, 1800 2333555 కూడా ఇచ్చారు.  ఈ నెంబర్లకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేస్తే... విచారణ జరిపి..  సదరు డెలివరీ బాయ్స్‌ చర్యలు తీసుకుంటామని తెలిపారు ఏపీ పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ హెచ్‌. అరుణ్‌కుమార్‌. 


ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ నుంచి 15 కిలోమీటర్లు పైబడిన ప్రాంతాలకు మాత్రమే నిర్దిష్ట రుసుము వసూలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నిబంధనలు ఎవరు  మీరినా... చర్యలు తప్పవని స్ట్రాంగ్‌గా హెచ్చరించారు ఏపీ పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ హెచ్‌. అరుణ్‌కుమార్‌. ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్‌ సెంటర్‌ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో  ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా గ్యాస్‌ సిలిండర్లు డెలివరీ చేయాలని ఆదేశించారు. ఏపీ పౌరసరఫరాల శాఖ ఆదేశాలను సామాన్యులకు కొంత  భారం తగ్గుతుంది. సిలిండర్‌ డెలివరీ అయినప్పుడల్లా చెల్లించే అదనపు ఛార్జీలు.. ఇక భరించాల్సిన అవసరం ఉండదు.


ఈ కాలంలో... పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఏ ఇల్లు చూసినా గ్యాస్‌పైనే వంట చేస్తున్నారు. అది గుడిసె అయినా సరే. గ్యాస్‌ సిలిండర్‌ వినియోగిస్తారు. అయితే... సిలిండర్‌ డెలివరీ చేసే సమయంలో.. ఇంటికి 20 రూపాయల నుంచి 50 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తారు డెలివరీ బాయ్స్‌. డిమాండ్‌ చేసి మరి డబ్బు తీసుకుంటారు. దీని వల్ల సామాన్యులపై అదరపు భారం పడుతుంది. డెలివరీ బాయ్స్‌ అడిగిన అదనపు డబ్బు ఇవ్వకపోతే... మరోసారి డెలివీరి ఇచ్చేందుకు ఇబ్బంది పెడతరానే ఉద్దేశంతో చాలా మంది చెల్లిస్తుంటారు. ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌కు సమీపంలో ఉన్న ప్రాంతాల్లో కూడా అదనపు వసూలు చేస్తున్నారు. డెలవరీ ఛార్జీలు ఎందుకు చెల్లించాలని.. ఎప్పుడు చెల్లించాలి అనే అవగాహన లేకపోవడంతో.... ప్రజలు కూడా అడిగినంత ముట్టజెప్తున్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఏపీ పౌరసరఫరాల శాఖ... కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. డెలివరీ ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీంతో ఏపీ గ్యాస్‌ వినియోగదారులకు కాస్త ఊరట లభించినట్టు అయ్యింది.