AP Ration Card eKYC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం తాజాగా ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తోంది. స్మార్ట్ రేషన్ కార్డుల వినియోగదారులు తమ ఈకేవైసీ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియలో జాప్యం జరిగితే రేషన్ సరకులు నిలిచిపోవడమే కాకుండా కార్డు రద్దు అయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలలో పారదర్శకతను పెంచడం, అర్హులైన లబ్ధిదారులను గుర్తించడం ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. గత ఏడాది ప్రభుత్వం పాత రేషన్ కార్డుల స్థానంలో లేటెస్ట్ టెక్నాలజీతో కొత్త రేషన్ కార్డులను జారీ చేసింది. అయితే వాటికి సంబంధించిన లబ్ధిదారులు చాలా మంది ఇంకా వేలిముద్రలు, ఐరిస్ ద్వారా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయలేదు.
Also Read: డ్వాక్రా మహిళలకు 35 శాతం రాయితీతో రుణాలు.. పీఎంఎఫ్ఎంఈ స్కీమ్ పూర్తి వివరాలు ఇలా!
నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వ ఫలాలు అందాలని, అనర్హుల పేర్లను తొలగించాలనే లక్ష్యంతో అధికారులు ఈ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. రేషన్ కార్డు అనేది కేవలం బియ్యం తీసుకోవడానికే మాత్రమే కాకుండా పింఛన్, ఇతర సబ్సిడీలు, సంక్షేమ పథకాలకు ప్రాథమిక ప్రాతిపదికగా ఉంది. అందుకే డేటా అప్డేట్ అత్యంత కీలకం.
Also Read: డ్వాక్రా మహిళల కుమార్తెల పెళ్లికి రూ.1 లక్ష లోన్! కల్యాణ లక్ష్మి స్కీమ్ దరఖాస్తు విధానం ఇదే!
ఈకేవైసీ చేయకుంటే ఏం జరుగుతుంది?
ఒక వేళ మీరు నిర్ణీత సమయంలో ఈకేవైసీ పూర్తి చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతి నెల అందే బియ్యం, ఇతర నిత్యావసర సరకులు సరఫరా ఆగిపోతుంది. ఈకేవైసీపీ పెండింగ్‌లో ఉన్న కార్డులను అధికారులు అనర్హుల జాబితాలో చేర్చే అవకాశం ఉంది. రేషన్ కార్డు ఆధారంగా వచ్చే తల్లికి వందనం, పింఛన్‌లు వంటి ఇతర ప్రభుత్వ పథకాల నగదు జమ ఆగిపోవచ్చు. ప్రభుత్వ రికార్డుల నుంచి లబ్ధిదారుడి పేరు శాశ్వతంగా తొలగించే ప్రమాదం ఉంది.
Also Read: ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వ టాప్ 4 స్కీమ్స్ ఇవే! వీటిలో చేరితే భవిష్యత్ బంగారమే!
ఈకేవైసీ ఎక్కడ, ఎలా పూర్తి చేయాలి?
లబ్ధిదారుల సౌకర్యార్థం ప్రభుత్వం ఈ ప్రక్రియను చాలా సులభతరం చేసింది. మీ పరిధిలోని రేషన్ డీలర్ వద్దకు వెళ్లి ఈపాస్ మెషిన్ ద్వారా ఈకేవైసీ పూర్తి చేయవచ్చు. కార్డులోని ప్రతి సభ్యుడు తమ ఆధార్ కార్డును వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. వృద్ధులు లేదా ఇతరులకు కొన్ని సార్లు వేలిముద్రలు పడవు. అటువంటి వారి ఐరిస్ స్కాన్ సహాయంతో ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఒక వేళ రేషన్ షాపులో టెక్నికల్ సమస్య వస్తే సమీపంలోని గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సంప్రదించి ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు.
ఈకేవైసీ పూర్తి చేయాలంటే కావాల్సి పత్రాలు ఏంటీ?
ఈకేవైసీ పూర్తి చేయాలంటే మీతోపాటు కొన్ని పత్రాలు తీసుకెళ్లాలి. ఒరిజినల్ ఆధార్ కార్డు, మీకు కేటాయించిన స్మార్ట్ రేషన్ కార్డు నెంబర్ ఇస్తే సరిపోతుంది. గత ఏడాది పాత కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులను పంపిణీ చేసిన నాటి నుంచి లబ్ధిదారుల సమాచారాన్ని డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ నిరంతరం కొనసాగుతోంది. కేవలం కార్డు ఉండటమే కాకుండా, లబ్ధిదారులు నిరంతరం రేషన్ సరుకులు తీసుకుంటూ ఉండాలని, తద్వారా వారు యాక్టివ్ యూజర్లుగా గుర్తింపు పొందుతారని ప్రభుత్వం సూచిస్తోంది.
Also Read: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ క్యాలెండర్‌లో రేషన్ కార్డు డేటా అత్యంత కీలకమైంది. పథకాల అర్హుల జాబితాను ఈ డేటా ఆధారంగానే తీసుకుంటారు. అందుకే కార్డుదారులు తమ ఆధార్ వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటే మంచిది.
