Govt Schemes For Girls: 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ప్రతి 1,000 మంది పురుషులకు 943 మంది స్త్రీలు ఉన్నారు. ఈ అసమానతను దృష్టిలో పెట్టుకుని, భారత ప్రభుత్వం ఆడపిల్లల రక్షణ కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. విద్య, ఆరోగ్యం, సమగ్ర అభివృద్ధి వంటి పలు రంగాలలో బాలికలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు ఈ పథకాలు ఉపయోగపడుతున్నాయి. మహిళల ఆర్థిక భద్రత, విద్యా అవకాశాలకు మద్దతు ఇచ్చేందుకు పలు కార్యక్రమాలను అందిస్తుంది. సుకన్య సమృద్ధి యోజన, మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్, స్మాల్ సేవింగ్స్ స్కీమ్ సహా పలు పథకాలు ఉన్నాయి.
బాలికలకు ప్రభుత్వ పథకాలు
1. సుకన్య సమృద్ధి యోజన
సుకన్య సమృద్ధి యోజన (SSY) అనేది 'బేటీ బచావో బేటీ పఢావో' కార్యక్రమం కింద ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వ మద్దతున్న పొదుపు పథకం. ఈ పథకంలో 10 సంవత్సరాల లోపు బాలికల విద్య, వివాహ ఖర్చుల కోసం పొదుపును ప్రోత్సహిస్తుంది.
పథకం ముఖ్య లక్షణాలు
- సుకన్య సమృద్ధి యోజన పోస్ట్ ఆఫీసులు, బ్యాంకుల్లో అందుబాటులో ఉంది.
- ఒక బాలిక పుట్టినప్పటి నుంచి ఆమెకు 10 సంవత్సరాలు నిండే వరకు, తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఆమె కోసం ఈ ఖాతాను ఓపెన్ చేయవచ్చు.
- బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ కంటే SSY అధిక వడ్డీ రేట్లను అందిస్తుంది. ప్రస్తుతం SSY వడ్డీ రేటు 8.2% (ఏప్రిల్-జూన్ 2026-27)గా ఉంది.
- ఈ పథకంలో సేవ్ చేసిన అమౌంట్ పై సెక్షన్ 80(C) కింద పన్ను మినహాయింపు ఉంటుంది.
- తల్లిదండ్రులు/సంరక్షకులు ఏడాదికి రూ. 250 నామమాత్రపు పెట్టుబడితో ఆడపిల్ల భవిష్యత్తు కోసం పొదుపు చేసుకోవచ్చు.
- అకౌంట్ ఓపెన్ చేసిన తేదీ నుంచి లేదా ఆడపిల్ల వివాహం జరిగిన తేదీ నుంచి, 21 ఏళ్లు మెచ్యూరిటీ పీరియడ్
2. బాలికా సమృద్ధి యోజన
బాలికా సమృద్ధి యోజన స్కీమ్ ను 1997లో బాలికల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద బీపీఎల్ కుటుంబాలలోని ఆడపిల్లలకు ఆర్థిక సహాయం అందిస్తుంది.
పథకం ముఖ్య లక్షణాలు
- 1997 ఆగస్టు 15న లేదా ఆ తర్వాత పుట్టిన ఆడపిల్లలు ఈ పథకానికి అర్హులు
- ఆడపిల్ల పుట్టినప్పుడు తల్లిదండ్రులకు రూ. 500 ఆర్థిక సహాయం అందిస్తారు.
- ఆడపిల్ల 10వ తరగతి పూర్తి చేసే వరకు ఆమెకు ఏడాదికి రూ. 300 నుండి రూ. 1,000 వరకు స్కాలర్‌షిప్ ఇస్తారు.
- ఒక కుటుంబం నుంచి ఇద్దరు కుమార్తెల వరకు ఈ స్కీమ్ కు అర్హులు
Also Read: మీ అమ్మాయి పుట్టిన వెంటనే ఈ పని చేయండి. 30 ఏళ్లు తిరిగే సరికి కోటీశ్వరురాలు అయిపోతుంది!
3. సీబీఎస్ఈ ఉడాన్ పథకం
సీబీఎస్ఈ ఉడాన్ స్కీమ్ బాలికల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తు్న్న స్కీమ్. ఇంజినీరింగ్, సాంకేతిక సంస్థలలో బాలికల విద్యను ప్రోత్సహించడానికి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ స్కీమ్ ను అమలు చేస్తు్న్నాయి.
ఈ పథకం ముఖ్య లక్షణాలు
- 11వ, 12వ తరగతులలో చేరే బాలికలకు ఉచిత ఆన్‌లైన్ కోర్సు మెటీరియల్
- ప్రతిభావంతులైన విద్యార్థుల నుంచి తోటి విద్యార్థులకు మార్గదర్శకత్వం
- వర్చువల్ క్లాసులు, చదువులో సహాయం
- ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ విభాగాలలో చేరిన బాలికలకు ఈ స్కీమ్ అందుబాటులో ఉంది.
- కనీస మార్కులు, ప్రతిభ ఆధారంగా సెలక్షన్ జరుగుతుంది
Also Read: మీ అబ్బాయికి స్కూల్ జాయిన్ చేసిన మొదటి నెల నుంచి ఈ పని చేశారంటే, ఉన్నత చదువులకో లోన్ తీసుకోవాల్సిన పని లేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
4. బాలికల విద్యకు ప్రోత్సాహకాలు
2008లో ప్రారంభించిన ఈ స్కీమ్ ను ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (ST) వర్గాలకు చెందిన బాలికలకు సెకండరీ ఎడ్యుకేషన్ లో చేరికను పెంచడం, బడి మానేసే వారి సంఖ్యను తగ్గించడం దీని లక్ష్యం.
పథకం ముఖ్య లక్షణాలు
- ఈ పథకానికి ఎంపికైనా వారి పేరు మీద FD ఖాతాలో రూ. 3,000 జమ చేస్తారు.
- ఆడపిల్లకు 18 ఏళ్లు నిండి, 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన ఎఫ్డీ మెచ్యూరిటీ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.
- ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి 8వ తరగతి పరీక్షలో పాస్ అవ్వాలి.
- 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉండాలి.
