అమరావతిలోని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నివాసం వద్ద జరిగిన ఘర్షణలో టీడీపీ లీడర్లకు సీఆర్‌పీసీ సెక్ష్ 41కింద నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఏపీ పోలీసులను ఆదేశించింది. ఈ కేసు విచారణ చేపట్టిన మానవేంద్రనాథ్‌రాయ్‌ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. 


టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ లీడర్లు భగ్గుమన్నారు. చంద్రబాబును కలిసి వినతి పత్రం ఇస్తామని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ కరకట్టపై ఉన్న ఆయన ఇంటికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ, టీడీపీ శ్రేణులు, లీడర్ల మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. పలువురికి గాయాలయ్యాయి. కొందరు టీడీపీ లీడర్లు ఎమ్మెల్యే కారును ధ్వంసం చేశారు. ఇరు వర్గాలు జెండా కర్రాలతో కొట్టుకున్నారు.


తాము శాంతియుతంగా వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తుంటే టీడీపీ లీడర్లు తమపై దాడి చేశారని ఎమ్మెల్యే జోగి రమేష్ కారు డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై టీడీపీ లీడర్లు కోర్టుకెళ్లారు. దాడికి వచ్చిన వారిని వదిలేసి తమపై కేసులు నమోదు చేయడమేంటని ప్రశ్నించారు. 
దీనిపై విచారించిన హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. ముందు నోటీసులు ఇవ్వాలని పోలీసులకు సూచించింది. 


మరోవైపు అయ్యన్నపాత్రుడిపై గుంటూరులోని ఆరండల్‌పేట పోలీసులు స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. గుంటూరుకు చెందిన న్యాయవాది వేముల ప్రసాద్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దళితురాలైన మంత్రి మేకతోటి సుచరిత, సీఎం జగన్‌పై అనుచతి వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. 


దీనిపై టీడీపీ లీడర్లు మండిపడ్డారు. తాము ఫిర్యాదులు చేస్తే పట్టించుకోని పోలీసులు.. వైసీపీ లీడర్లు ఎవరు ఫిర్యాదు చేసినా దర్యాప్తు లేకుండానే కేసులు పెడుతున్నారని  ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే కోర్టుల్లో కేసులు వేయాల్సి వస్తుందన్నారు. పోలీసుల తీరు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయంటున్నారు. టీడీపీ అధినేత కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 


Also Read: ఢిల్లీ టూర్‌కు జగన్ కూడా !? మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశంలో పాల్గొనే అవకాశం !


Also Read: ఫలితాలు ఏకపక్షం.. ప్రజలు తమ పక్షమే అంటున్నారు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి


Also Read: ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి