AP Latest News: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వ హాయాంలో జరిగిన పనుల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేయడంపై మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. వైసీపీ హాయాంలో పోలవరం ప్రాజెక్టు విధ్వంసం జరిగిందని చంద్రబాబు అనడాన్ని అంబటి రాంబాబు తప్పుబట్టారు. టీడీపీ ప్రభుత్వ తప్పుడు పనుల కారణంగానే ప్రాజెక్టు మరింత ఆలస్యం అవుతూ వచ్చిందని.. పోలవరాన్ని కమీషన్ల కోసం చంద్రబాబు మార్చుకున్నారని ఆరోపించారు. అంబటి రాంబాబు శుక్రవారం (జూన్ 28) విలేకరుల సమావేశం నిర్వహించారు. చంద్రబాబు తనను పదే పదే ఆంబోతు అంటారని గుర్తు చేసుకున్నారు.


అంబటి రాంబాబు మాట్లాడుతూ.. అసలు పోలవరం స్పిల్‌ వే ఛానల్‌ పూర్తి కాకుండా, అప్రోచ్‌ ఛానల్‌ పూర్తి కాకుండా, నది డైవర్షన్‌ పూర్తి కాకుండా కాపర్‌ డ్యామ్‌ను ఎలా ప్రారంభిస్తారని అంబటి ప్రశ్నించారు. ఇంకా డయా ఫ్రం వాల్‌ను నిర్మించడం గత చంద్రబాబు ప్రభుత్వంలో చేసిన చారిత్రాత్మక తప్పిదమని అన్నారు. దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రాజెక్టుని వారి దగ్గర్నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకున్నదని ప్రశ్నించారు. 


Also Read: పోలవరానికి అదే శాపం - శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు