Pawan Kalyan Bus Yatra : ఏపీలో జనసేన జెట్ స్పీడుతో దూసుకెళ్తోంది. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో అధికార వైసీపీని ఢీకొట్టేందుకు ఉరకలేస్తోంది. అందుకు తగ్గట్టే వరుస కార్యక్రమాలతో కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. అంతేకాదు టీజర్ మాత్రమే రిలీజైందా? అసలు పొలిటికల్ ట్రైలర్ ఎప్పుడు? అనే చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో నడుస్తోంది. మరీ ముఖ్యంగా పవన్ చంద్రబాబు భేటీ తర్వాత ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. పవన్-చంద్రబాబు మీటింగ్‌కు ఒకరోజు ముందే పవన్‌తో సోమువీర్రాజు సమావేశమయ్యారు. విశాఖ ఘటనపై పవన్‌కు సోమువీర్రాజు సంఘీభావం తెలిపారు. కానీ విజయవాడలో చంద్రబాబు-పవన్ భేటీ తర్వాత రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. మరీ ముఖ్యంగా 2024 ఎన్నికలే టార్గెట్ పెట్టుకుని మరీ ముందుకు కదులుతున్నారు పవన్ కల్యాణ్.
తిరుపతి నుంచి బస్సు యాత్ర
జనసేనాని ప్రచార రథం శరవేగంగా రెడీ అయ్యింది. ఈ ప్రచార రథంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, ఇందులోనే ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించనున్నారు. ఈ ప్రచార యాత్ర మరికొన్నిరోజుల్లో ప్రారంభం కానుంది. ఈ యాత్రలో పవన్ కల్యాణ్ ఇదే వ్యాన్‌ను ఉపయోగించబోతుండటంతో.. దగ్గర ఉండి మరీ ఈ వ్యాన్‌ను రెడీ చేయించుకున్నారు పవన్. జనంలోకి వెళ్లేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ చేపట్టబోయే వ్యాన్ మరికొన్నిరోజుల్లో ప్రారంభం కానుంది. ఈ యాత్రలో పవన్ కల్యాణ్ వినియోగించే బస్సును ప్రత్యేకంగా రూపొందించారు. ప్రస్తుతం ఈ బస్సు పనులు ముగిశాయి. అంతేకాదు తిరుపతి నుంచి ప్రారంభంకానున్న బస్సుయాత్ర.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాలను కవర్ చేసేలా రూట్ మ్యాప్ సిద్ధమవుతోంది. ఈ పర్యటనలో గత ఎన్నికల్లో జనసేన దగ్గర వరకు వచ్చి ఓడిపోయిన నియోజకవర్గాలను ప్రధానంగా టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడున్న ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే.. విజయానికి కావాల్సిన ఓట్ల శాతం పెంచుకోవాలని జనసేన భావిస్తోంది.
ప్రచార రథంలో హై సెక్యూరిటీ సిస్టమ్
అలాంటి దాదాపు 30 నియోజకవర్గాలను ఎంపిక చేసుకొని సభలు నిర్వహించడంతో పాటు అవసరమైతే పవన్ పాదయాత్రను కూడా నిర్వహిస్తారన్న ప్రచారం జరుగుతోంది. తిరుపతి నుంచి మొదలయ్యే యాత్రలో ఉమ్మడి జిల్లాల్లో ప్రధాన నగరాలు, జనసేనకు పట్టున్న నియోజకవర్గాలను టచ్ చేయనున్నారు. అయితే భారీ ఎత్తున్న ప్రారంభం కాబోతున్న ఈ బస్సు యాత్ర కోసం బస్సులో అత్యాధునిక టెక్నాలజీతో పాటు మెరుగైన హంగులతో వాహనాన్ని రెడీ చేశారంటా. పవన్ కల్యాణ్ సూచనల మేరకే ఈ ప్రచార రథాన్ని రెడీ చేసింది పార్టీ క్యాడర్. అయితే ఈ బస్సు మంచి పొలిటికల్ మోడల్‌తో సిద్ధం చేశారు. అయితే కొద్ది రోజుల క్రితం పవన్ కల్యాణ్ తన రథ చక్రాన్ని పరిశీలించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే చూసేందుకు ఈ బస్సు మిలిటరీ కలర్ లుక్‌తో పాటు హై సెక్యూరిటీ సిస్టమ్ విత్ జీపిఎస్ ట్రాకింగ్ వంటి ఫెసిలిటీలు బస్సులో ఉన్నాయంటా. అంతేకాదు.. బస్సులోకి చుట్టూరా 360 డిగ్రీలో సీసీ కెమెరాలు ఉండి.. నిత్యం మానిటరింగ్ చేసే ఓ స్పెషల్ టీమ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.