BL Santosh Pition :  తెలంగాణ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన కేసులో తనను నిందితునిగా చేర్చడంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై తప్పుడు కేసు పెట్టారని ఆ కేసును క్వాష్ చేయాలని పిటిషన్‌లో కోరారు. ఈ కేసులో బీఎల్ సంతోష్‌ను బుదవారం వరకూ నిందితునిగా చేర్చలేదు. మొదట ఆయనకు నోటీసులు ఇచ్చారు. అయితే నోటీసులు ఇవ్వడానికి కూడా ఇబ్బందులు ఎదురయ్యాయని కోర్టును ఆశ్రయించారు. దీంతో ఢిల్లీ పోలీసుల సాయంతో నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ఇంకా విచారణకు హాజరు కాక ముందే..  బీఎల్ సంతోష్‌ను ఏ-4 నిందితునిగా చేరుస్తూ.. ఏసీబీ కోర్టులో ప్రత్యేక దర్యాప్తు బృందం మెమో దాఖలు చేసింది. 


మరో వైపు గురువారమే రెండోసారి  సిట్ అధికారులు బీఎల్ సంతోష్ కి   జారీ  41 ఏ సీఆర్‌సీపీ  కింద  నోటీసులు జారీ  చేశారు. 28వ తేదీన కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.   41ఏ సీఆర్‌పీసీ సెక్షన్ కింద  బీఎల్ సంతోష్ పాటు  తుషార్, జగ్గుస్వామిలపై  కూడా   పోలీసులు  కేసు నమోదు  చేశారు.  ఈ  కేసులో  అరెస్టైన  నిందితులు  బీఎల్ సంతోష్ తో  మాట్లాడినట్టుగా సిట్  వాదిస్తుంది.  ఈ  కేసులో  సంతోష్ ను విచారిస్తే  కీలక  విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని సిట్  చెబుతుంది. ఎమ్మెల్యేలతో నిందితులు  మాట్లాడినట్టుగా  బయటకు వచ్చినట్టుగా  ఉన్న  ఆడియోలు, వీడియోల్లో  కూడా  సంతోష్  పేరును కూడా  ఉపయోగించారు. ఈ  కేసులో  తన  పేరును తొలగించాలని  కోరుతూ  బీజేపీ  నేత  బీఎల్ సంతోష్   తెలంగాణ హైకోర్టులో పిటిషన్  దాఖలు  చేశారు.  


ఈ కేసులో పోలీసులు దూకుడు మీద వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకూ నోటీసులు జారీ చేసిన వారిలో ఒక్క లాయ్ర శ్రీనివాస్ తప్ప ఎవరూ హాజరు కాలేదు. తాజాగా  మరో ఐదుగురికి నోటీసులు జారీ చేశారు.  అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన జగ్గుస్వామి సోదరుడితో పాటు సిబ్బందికి నోటీసులిచ్చింది. జగ్గుస్వామి సోదరుడు మణిలాల్, అతని ముగ్గురు పర్సనల్ అసిస్టెంట్లు శరత్, ప్రశాంత్, విమల్‌కు నోటీసులు జారీ చేసింది. జగ్గు పనిచేస్తున్న అమృత ఆసుపత్రి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు సైతం సిట్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం 41-ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసిన సిట్.. ఈసారి కూడా హాజరుకాకపోతే 41-ఏ (3), (4) సీఆర్పీసీ కింద అరెస్టు చేస్తామని హెచ్చరించింది.


జైల్లో ఉన్న ముగ్గురి నుంచి సేకరించిన సమాచారం మేరకు సిట్‌ అధికారులు బీఎల్‌ సంతోష్‌తోపాటు జగ్గుస్వామి, తుషార్‌ వెల్లపల్లిని నిందితులుగా చేర్ారు.   కేరళలో సోదాల్లోనూ జగ్గుస్వామి, తుషార్‌ అందుబాటులోకి రాకపోవడంతో ఈ ఇద్దరికి ఇప్పటికే లుక్‌ అవుట్‌ నోటీసులు సైతం జారీచేశారు. బీఎల్‌ సంతోష్‌, జగ్గుస్వామి, తుషార్‌తోపాటు శ్రీనివాస్‌ల పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయడంతో ఈ కేసులో కీలక మలుపులు ఉండబోతున్నాయని చెబుతున్నారు. మరో వైపు జైల్లో ఉన్న ముగ్గురు నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.