Chandrababu Case :   తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తమ కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన చేసిన పిటిషన్‌పై నిర్ణయాన్ని ఏసీబీ కోర్టు మరోసారి వాయిదా వేసింది. బుధవారం మధ్యాహ్నం వరకూ వాదలు జరిగాయి. ఆ రోజు సాయంత్రం తీర్పు ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ జడ్జి గురువారం ఉదయానికి వాయిదా వేశారు.తర్వతా సాయంత్రం నాలుగు గంటలకు ప్రకటిస్తామన్నారు. అయితే హైకోర్టులో క్వాష్ పిటిషన్‌పై తీర్పు రావాల్సి ఉన్నందున మరోసారి వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం ఉదయం పదిన్నరకు న్యాయమూర్తి తీర్పు ప్రకటించే అవకాశం ఉంది. 


తనపై పెట్టిన కేసు అక్రమమని, చట్ట విరుద్ధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని .. రిమాండ్ రిపోర్టును క్వాష్ చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై మంగళవారం కోర్టులో వాదనలు జరిగాయి.  ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మధ్యాహ్నం గం.12. నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వాదనలు జరిగాయి. తొలుత చంద్రబాబు తరఫు న్యాయవాదులు సిద్ధార్థ లూద్రా, హరీశ్ సాల్వే  వాదనలు వినిపించారు. ఆ తర్వాత రెండున్నర గంటల తర్వాత నుంచి సాయంత్రం ఐదు వరకు సీఐడీ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.
సీఐడీ తీరును చంద్రబాబు తరఫు న్యాయవాదులు తప్పుబట్టారు. అరెస్టుకు గవర్నర్ అనుమతి తీసుకోలేదని, సీఐడీ చంద్రబాబుకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సృష్టిస్తోందని వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున ముకుల్ రోహాత్గీ  వర్చువల్ పద్ధతిలో వాదనలు వినిపించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయగానే చంద్రబాబును అరెస్ట్ చేయలేదని, రెండున్నరేళ్ల పాటు పూర్తి ఆధారాలు సేకరించాకే అరెస్ట్ చేసినట్లు తెలిపారు. తీర్పును రెండు రోజుల్లో ప్రకటిస్తామని జస్టిస్ శ్రీనివాసరెడ్డి  తెలిపారు. 


గురువారం హైకోర్టు నుంచి తీర్పు వస్తుందని అనుకున్నారు. కానీ ఎలాంటి తీర్పు రాలేదు. క్వాష్ పిటిషన్‌పై జడ్జిమెంట్ 25వ తేదీకి వాయిదా పడినట్లుగా..ఓ న్యాయమూర్తి చెప్పారని ఎఎన్ఐ న్యూస్ ఎజెన్సీ చెప్పింది. అయితే దీనిపైనా స్పష్టత లేదు. 


 





అయితే అధికారికంగా ఇంకా ఎలాంటి సమాచారం లేదు. క్వాష్ పిటిషన్‌పై తీర్పును  న్యాయమూర్తి వాయిదా  సోమవారానికి వాయిదా వేస్తే.. కస్టడి పిటిషన్‌పై తీర్పును కూడా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సోమవారానికి వాయిదా వేసే అవకాశం ఉందని  భావిస్తున్నారు.  


చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందన్న దానిపై దేశవ్యాప్తంగా న్యాయనిపుణులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ కేసు తీర్పు  లో హైకోర్టు నిర్ణయం.. న్యాయపరంగా కూడా అనేక చర్చోపచర్చలకు కారణమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.