Chandrababu Case :  చంద్రబాబును విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని సీఐడీ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు టీడీపీ నేతలు న్యాయపరంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించేందుకు సుప్రీం సీనియర్ న్యాయవాది  సిద్ధార్థ లుధ్రా విజయవాడ వచ్చారు.  ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్న సిద్ధార్థ లూధ్రా అండ్ టీమ్ .. కోర్టులో వాదనలు వినిపించేందుకు సిద్ధమయింది.  చంద్రబాబు తరఫున బెయిల్ పిటిషన్ పై వాదనలు  సిద్ధార్థ లుధ్రా వినిపించే అవకాశం ఉంది.  చంద్రబాబు కేసులను సిద్దార్థ్   చూసుకుంటారు. అమరావతి కేసును కూడా సిద్దార్థ్   వాదించారు . మరోవైపు సీఐడీ, సిట్ తరపున వాదనలు వినిపించనున్నారు .


మరికాసేపట్లో కుంచనపల్లి సిట్ ఆఫీసుకు చంద్రబాబు!                                                



అరెస్టయిన చంద్రబాబును పోలీసులు తాడేపల్లిలోని కుంచనపల్లికి తరలించనున్నారు. సిట్ ఆఫీసులో చంద్రబాబును విచారించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. అక్కడ చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించి, అనంతరం ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. టీడీపీ అధినేత తరలింపుతో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. చంద్రబును తరలిస్తున్న మార్గంలోనూ రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. నంద్యాల, గిద్దలూరు బేస్తవారిపేట మీదుగా ఆయన్ను విజయవాడ  తీసుకెళ్తున్నారు. మార్కాపురం నియోజకవర్గం తాడివారి పల్లిలో చంద్రబాబుని తరలిస్తున్న కాన్వాయ్‌ని స్థానిక టీడీపీ నేతలు అడ్డుకున్నారు. చంద్రబాబును అరెస్ట్‌ను నిరసిస్తూ రోడ్డుపై అడ్డంగా నిలబడ్డారు. పోలీసులు వారిపై లాఠీ చార్జ్ చేశారు. టీడీపీ నేతలు ఎక్కడికక్కడ అడ్డుపడుతున్న నేపథ్యంలో చంద్రబాబు కన్వాయ్‌ని పోలీసులు బేస్తవారిపేట, పొదిలి, దర్శి, అద్దంకి, చిలకలూరిపేట, గుంటూరు మీదుగా విజయవాడకు తరలిస్తున్నారు. పలు చోట్ల టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఆటంకాలు ఎదురయ్యాయి.                                                 



స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో ఏ1గా చంద్రబాబు- నమోదైన సెక్షన్‌లు ఇవే                                                                



శనివారం ఉదయం ఆరు గంటలకు స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసినట్టు సీఐడీ ప్రకటించింది.  పోలీసులు. సిఆర్పిసి సెక్షన్ 50(1) నోటీస్ సర్వ్ చేశారు. ఇది సిఐడి డిఎస్పీ ధనుంజయుడు పేరు మీద వచ్చింది. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబును అరెస్ట్ చేస్తున్నట్టు చెప్పారు. చంద్రబాబు బాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రెడ్‌ విత్‌ 34 ఎండ్‌ 37 ఏపీసీ సెక్షన్‌ల కింద  కేసులు నమోదు చేశారు.