YS Viveka Case :  మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డికి ఇచ్చిన ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ... సునీత దాఖలు చేసుకున్న పిటిషన్‌ ను శుక్రవారం సుప్రీంకోర్టులో మెన్షన్ చేసే అవకాశం ఉంది.  గురువారం సుప్రీం వెకేషన్ బెంచ్ ముందు నేడు సునీత తరపు సీనియర్ లాయర్ సిద్ధార్ధ్ లూధ్రా ప్రస్తావించారు. ఈ మేరకు సునీత పిటిషన్‌ను శుక్రవారం మెన్షన్ చేయడానికి సుప్రీంకోర్టు అనుమతించింది.   అవినాశ్‌కు గత నెల 31న తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సునీత సుప్రీంకోర్టులో సవాలు చేశారు. అవినాశ్‌పై మోపిన అభియోగాలన్నీ చాలా కీలకమైనవని పిటీషన్‌లో సునీత పేర్కొన్నారు. సీబీఐ మోపిన అభియోగాలను హైకోర్టు సరిగ్గా పరిగణలోకి తీసుకోలేదని పిటిషన్‌లో సునీత పేర్కొన్నారు. హైకోర్టు తీర్పులో కొన్ని లోపాలున్నాయని కూడా సునీత తెలిపారు. అవినాశ్ ముందస్తు బెయిల్‌ను సీబీఐ సైతం వ్యతిరేకిస్తోందని పిటిషన్‌లో వెల్లడించారు. సునీత పిటీషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంలో సీబీఐ సైతం వాదనలు వినిపించే అవకాశం ఉంది.  


నెల్లూరులో రాజన్న భవన్‌కు పోటీగా జగనన్న భవన్- అనిల్‌, రూప్‌ కుమార్‌ పొలిటికల్‌ గేమ్‌లో అప్‌డేట్‌ వెర్షన్


నాంపల్లి కోర్టుకు హాజరైన వివేకా కేసు నిందితులు 


నాంపల్లి కోర్టు లో వివేక కేస్ విచారణను జూన్ 16 కు వాయిదా వేసింది  సిబిఐ కోర్టు.   భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి లను కోర్ట్ లో హాజరు పరిచారు. ఇప్పటికే భాస్కర్ రెడ్డి   బెయిల్ పిటిషన్ వేశారు. శుక్రవారం కోర్టు తీర్పు వెల్లడించనుంది.  తన ఆరోగ్యం దృష్యా బెయిల్ ఇవ్వాలని భాస్కర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ ను పరిగణలోకి తీసుకున్న కోర్టు అటు భాస్కర్ రెడ్డి లాయర్ ఇటు సీబీఐ వాదనలను వింది. అలాగే ఇంప్లీడ్ గా ఉన్న సినీత కూడా వాదనలు వినిపించారు. భాస్కర్ రెడ్డి ఆరోగ్య దృష్యా బెయిల్ ఇవ్వాలని ఉమామహేశ్వర్ రావు కోరగా..బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ వాదనలు వినిపించింది. అయితే వాదనలను రాతపూర్వకంగా ఇవ్వాలని కోర్టు సూచించింది. తీర్పును శుక్రవారం ప్రకటించే అవకాశం  ఉంది.  


చంద్రబాబుతో పొత్తు వద్దు- అధిష్ఠానానికి ఏపీ బీజేపీలోని ఓ వర్గం లీడర్ల సూచన !


మాగుంట రాఘవ్ బెయిల్ ను సవాల్ చేసిన ఈడీ 
 
మరో వైపు  ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న మాగుంట రాఘవ బెయిల్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్   సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రాఘువ బెయిల్‌పై కూడా శుక్రవారం విచారించిందుకు సుప్రీం అనుమతి ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి నిన్న రాఘవకు రెండు వారాల మధ్యంతర బెయిల్‌ను ఢిల్లీ హైకోర్టు మంజూరు చేసింది.  మాగుంట రాఘవకు మధ్యంతర బెయిల్‌కు ఆయన చూపిన కారణాలు సరైనవి కావని ఈడీ పేర్కొంది. ఈ క్రమంలో రాఘవ బెయిల్‌పై రేపు విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు వెకేషన్ బెంచ్ అంగీకారం తెలియజేసింది.