Today Top Headlines In AP And Telangana:
1. డ్రోన్స్ తయారీ హబ్‌గా ఏపీ
డ్రోన్ల తయారీ రంగంలో దేశంలోనే ఆంద్రప్రదేశ్ అత్యత్తమ కేంద్రంగా రూపొందించేలా రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తోందని ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె.దినేష్ కుమార్ అన్నారు. ఇందు కోసం కర్నూలు జిల్లా ఓర్వకల్లులో (Orvakallu) 300 ఎకరాల సువిశాల ప్రాంగణంలో దేశంలోనే మొట్టమొదటి, అతి పెద్ద డ్రోన్ సిటీని (Drone City) ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే అక్కడ స్థల సేకరణ పూర్తి చేశామని, అభివృద్ధి పనులు చేపట్టబోతున్నామని తెలిపారు. ఇంకా చదవండి.
2. ఎన్టీఆర్‌కు ఈసారైనా భారతరత్న దక్కేనా.?
ఎన్టీఆర్‌కు 'భారతరత్న' ఇవ్వాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. అయితే ప్రతిసారి అది వెనక్కిపోతూనే వస్తోంది. రాజకీయంగాను సినిమాపరంగానూ తెలుగువాడి ఖ్యాతిని జాతీయ స్థాయిలో ఘనంగా చాటిన నందమూరి తారక రామారావుకు ' భారతరత్న' ఇచ్చి గౌరవించాలని పార్టీలు కతీతంగా ప్రతి తెలుగువాడు కోరుతున్నాడు. మరో తెలుగు దిగ్గజం పీవీ నరసింహారావుకు ఆ పురస్కారం దక్కింది. ఇక పెండింగ్లో ఉంది ఎన్టీఆర్ మాత్రమే.1999- 2004 మధ్య కేంద్రంలో టిడిపి చక్రం తిప్పినప్పుడు ఎన్టీఆర్‌కు 'భారతరత్న' సాధించడం వీలుపడి ఉండేదనీ కానీ అప్పట్లో చంద్రబాబు పెద్దగా ప్రయత్నం చేయలేదని ఆయన రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేస్తూ ఉంటారు. ఇంకా చదవండి.
3. రియల్ పొలిటికల్ హీరో స్టోరీ తెలుసా?
ఒక నాయకుడు జనంలోంచి పుడుతాడు... ఇంకో నాయకుడు అణిచివేత నుంచి పడుతాడు.. మరో నాయకుడు పీడిత ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్రాలు అందించాలన్న లక్ష్యంతో పుడుతాడు. కానీ రాయలసీమలో ఒక నాయకుడు మాత్రం ఈ పరిస్థితుల నుంచి పుట్టాడు. ఆయన ఆస్తమించి రెండు దశాబ్ధాలైనా ఇప్పటికీ ప్రజల గుండెల్లో ధ్వనిస్తున్న నాయకుడే పరిటాల రవీంద్ర. పరిటాల రవి అన్నది కేవలం పేరు మాత్రమే కాదు.. ఆ పేరు చాలా మందికి వణుకు తెప్పించేది. పీడిత ప్రజల గుండెల్లో ధైర్యం నింపేది.. పేదప్రజల కన్నీరు తుడిచేది.. ఇంకా చదవండి.
4. ముగిసిన తెలంగాణ సీఎం రేవంత్ దావోస్ పర్యటన
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దావోస్ పర్యటన ముగిసింది. రాష్ట్రంలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా సాగిన ఆయన పర్యటన విజయవంతమైంది. దుబాయ్ మీదుగా శుక్రవారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు (Shamshabad Airport) చేరుకున్న ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు, నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సింగపూర్, దావోస్ పర్యటనలను విజయవంతం చేసి రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చారంటూ ప్రశంసించారు. ఇంకా చదవండి.
5. హన్మకొండ గ్రామసభలో ఉద్రిక్తత
తెలంగాణలో గత 2 రోజులుగా గ్రామసభలు కొనసాగుతుండగా పలుచోట్ల ఉద్రిక్తత నెలకొంది. హనుమకొండ జిల్లా కమలాపూర్ (Kamalapur) గ్రామసభలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలేవీ అమలు చేయలేదని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. డబుల్ బెడ్ రూం ఇళ్ల లిస్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) అధికారులను ప్రశ్నించారు. ఇంకా చదవండి.