Venkatesh Daggubati : విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ రిలీజ్ అయిన వారం తర్వాత కూడా సాలిడ్ కలెక్షన్లను రాబడుతోంది. తాజాగా చిత్రం బృందం 'సంక్రాంతికి వస్తున్నాం' ప్రెస్ మీట్ ను నిర్వహించగా, వెంకటేష్ కి రిపోర్టర్ల నుంచి ఓ ఊహించిన ప్రశ్న ఎదురయింది. అయితే వెంకీ మామ ఇంత సీరియస్ డిస్కషన్ లో కూడా తన కామెడీ టైమింగ్ తో కూల్ గా సమాధానం చెప్పి అక్కడున్న అందరినీ నవ్వించారు.
బ్లాక్ మనీపై వెంకటేష్ కు ప్రశ్న
'సంక్రాంతికి వస్తున్నాం' తాజా ప్రెస్ మీట్ లో హీరో వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ సినిమాకి ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ పై డైరెక్టర్, హీరో సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా బీమ్స్ సిసిరోలియో సంగీతం ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిందని అన్నారు. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకు 230 కోట్ల కలెక్షన్లు వచ్చాయనే విషయం నిజమేనని డైరెక్టర్ అనిల్ రావిపూడి కన్ఫామ్ చేశారు. తాము ఎలాంటి ఫేక్ కలెక్షన్లను అనౌన్స్ చేయలేదని ఈ సందర్భంగా అనిల్ రావిపూడి వెల్లడించారు.
ఈ క్రమంలోనే ఓ రిపోర్టర్ "ఐటీ రైడ్స్ బ్యాక్ డ్రాప్ లో..." అని స్టార్ట్ చేయగానే... వెంకటేష్ అందుకుని "ఐటీ రైడ్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమానా?" అని ప్రశ్నించారు. వెంటనే సదరు రిపోర్టర్ "కాదు సార్... ఐటి రైడ్స్ జరుగుతున్న నేపథ్యంలో నిర్మాతలతో మాట్లాడుతుంటే ఓ సీరియస్ పాయింట్ వెలుగులోకి వచ్చింది. హీరోలు గనక మొత్తం వైట్ తీసుకుంటే ఏం నిర్మాత కూడా బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు అనే బిగ్ స్టేట్మెంట్ చాలా పెద్ద నిర్మాత దగ్గర నుంచి వచ్చింది. ఒక్క హీరో బ్లాక్ తీసుకోకపోతే ఇండస్ట్రీలో ఇంకెవరికీ మేము బ్లాక్ ఇవ్వాల్సిన పనిలేదు. హీరోల కోసమే ఇలా బ్లాక్ ఇచ్చి, మేము బ్లాక్లోనే ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తోంది అనే స్టేట్మెంట్ ఇచ్చారు కొంతమంది బడా నిర్మాతలు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? " అని ప్రశ్నించారు.
ఈ సీరియస్ ప్రశ్నకి వెంకటేష్ స్పందిస్తూ "మిగతా వాళ్ళ ఒపీనియన్ నాకు తెలీదు గానీ... నేనైతే ఫుల్ వైట్ తీసుకుంటాను. వైట్ లో వైట్ తీసుకుంటాను. తీసుకునేది కొంచెమే... ఎక్కువ తీసుకోను కూడా. ఆ తీసుకునే కొంచెం కూడా ఆఫీసులోనే తీసుకుంటారు. ఎప్పుడో ఒకసారి నా ఖర్చుల కోసం కొంత తెచ్చుకుంటాను అంతే" అంటూ సరదాగా సమాధానం చెప్పారు.
ఇచ్చిన, వచ్చిన దానితోనే తృప్తి
"ప్రతి హీరో కూడా పాన్ ఇండియా సినిమా చేయాలని, ఆ రికార్డులను కొట్టాలని అనుకుంటున్నారు. ఈ లెక్కన మీరు పోస్టర్లో వేసిన దాని ప్రకారం 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా 230 కోట్లు రాబట్టింది. అదే పాన్ ఇండియా మూవీ అయితే 2300 కోట్లు కలెక్ట్ చేసేది కదా. నీకు ఎప్పుడైనా ఇలా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తే బాగుండేది అనే ఫీలింగ్ కలిగిందా?"... అనే ప్రశ్నకి వెంకీ మామ "టైం వచ్చేదాకా వెయిట్ చేద్దాం... ఇప్పుడు వచ్చింది తీసుకో, దేవుడు ఇచ్చాడు తీసుకో. నేనెప్పుడూ అడగలేదు... కానీ ఇచ్చిందాన్ని మాత్రం సంతోషంగా తీసుకుంటాను. ఆ దేవుడిని నేనెప్పుడూ ఏదీ కోరలేదు... ఇది మాత్రం పెద్ద బోనస్. న్యూ ఇయర్ కానుకగా వచ్చిన ఈ బోనస్ కి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇలా జరిగినప్పుడు అందరికీ థాంక్ ఫుల్ గా ఉండాలి. మీ అందరి ఎనర్జీ వల్లే ఇది సాధ్యమైంది" అని వెంకటేష్ చెప్పుకొచ్చాడు.