Today Top Headlines In AP And Telangana:
1. ఏపీలో మరోసారి భూ ప్రకంపనలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు వచ్చాయి. జిల్లాలోని ముండ్లమూరు మండలంలో రెండు, మూడు సెకన్లపాటు భూమి కంపించింది. సింగన్నపాలెంట, ముండ్లమూరు, మారెళ్లలో భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. శనివారం ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో పలుచోట్ల మూడు సెకన్ల పాటు భూమి కంపించగా, వరుసగా రెండో రోజు ఆదివారం సైతం ప్రకాశం జిల్లాల్లో భూ ప్రకంపనలు రావడం కలకలం రేపుతోంది. ప్రకాశం జిల్లాతో పాటు బాపట్ల జిల్లాల్లో పలుచోట్ల శనివారం భూమి కంపించింది. ఇంకా చదవండి.
2. విశాఖ రైల్వే స్టేషన్‌లో తప్పిన ఘోర ప్రమాదం
విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో ఆదివారం వేకువజామున పెను ప్రమాదం తప్పింది. విశాఖ స్టేషన్ నుంచి వెళ్తున్న ఓ రైలు విద్యుత్ తీగలను ఈడ్చుకెళ్లింది. ఇది గమనించిన అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో విశాఖ రైల్వే స్టేషన్లో పెను ప్రమాదం తప్పిపోయింది. దాంతో పులు రైళ్ల రాకపోకలు కి అంతరాయం తలెత్తింది. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రస్తుతం రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఆదివారం వేకువజామున ఈ ఘటన జరిగింది. తమిళనాడులోని తిరునెల్వేలి నుంచి బయలుదేరిన సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22606) పశ్చిమ బెంగాల్‌లోని పురులియాకు వెళ్తోంది. ఇంకా చదవండి.
3. అన్నమయ్య జిల్లాలో కాల్పుల కలకలం
తెలుగు రాష్ట్రాల్లోనూ గన్ కల్చర్ పెరిగిపోతోంది. గత కొన్నేళ్లుగా గమనిస్తే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నిత్యం ఏదో చోట తుపాకీతో బెదిరింపులనో, గన్‌తో కాల్పులు జరిపి నిందితులు పరారీ అనే విషయాలు వింటూనే ఉన్నాం. తాజాగా ఏపీలోని అన్నమయ్య జిల్లాలో కాల్పుల ఘటన కలకలం రేపింది. రాయచోటి మండలం మాధవరంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు వ్యాపారులపై కాల్పులు జరిపారు. స్క్రాప్ వ్యాపారం చేసే ఇద్దరిపై నిందితులు తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు. నిందితుల కాల్పుల్లో పాత సామాన్లు కొనే వ్యాపారులు హనుమంతు(50)తో పాటు రమణ(30) తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా చదవండి.
4. అల్లు అర్జున్ అరెస్ట్ సరికాదన్న పురంధేశ్వరి
హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటను ప్రేరేపించింది హీరో అల్లు అర్జున్ కాదు అని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. తన సినిమా పుష్ప 2 ప్రీమియర్ షో కనుక హీరో అల్లు అర్జున్ థియేటర్‌కు సినిమా చూసేందుకు వెళ్లారు. కానీ ఈ ఘటనకు బాధ్యుడ్ని చేసి అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం సమంజసం కాదని రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి అభిప్రాయపడ్డారు. ఈ కేసులో ఇదివరకే అరెస్టైన అల్లు అర్జున్ కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఇంకా చదవండి.
5. కేటీఆర్ ఛాలెంజ్‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా.?
కాంగ్రెస్ పాలనలో 24 గంటలు విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొత్తం రాజీనామా చేస్తాని మాజీ మంత్రి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. లేకపోతే రైతు రుణమాఫీ ఎక్కడైనా నూటికి నూరు పాళ్లు జరిగినట్లు నిరూపించినా బీఆర్ఎస్ సభ్యులు మొత్తం రాజీనామాకు సిద్ధమన్నారు. కొడంగల్ , సిరిసిల్ల, కొండారెడ్డి పల్లి, పాలేరు నియోజకవర్గాలకు వెళ్దాం. ఎక్కడైనా సరే 100 శాతం రుణమాఫీ జరిగి ఉంటే రాజీనామాకు సిద్ధమని.. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేస్తామని ఛాలెంజ్ విసిరారు కేటీఆర్. ఇంకా చదవండి.