Top Headlines In AP And Telangana:


1. ఏపీలో టీచర్ల ప్రమోషన్లు, బదిలీలకు రోడ్ మ్యాప్ విడుదల


ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి టీచర్ల ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. టీచర్ల బదిలీల, ప్రమోషన్లు పారదర్శకంగా జరుగుతాయని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పలుమార్లు స్పష్టం చేశారు. గతం వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన బదిలీల ఉత్తర్వులను ఇదివరకే రద్దు చేయడం తెలిసిందే. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీచర్లకు ఏపీ ప్రభుత్వం కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఏపీలో టీచర్ల ప్రమోషన్లు, బదిలీలకు సంబంధించిన రోడ్ మ్యాప్ విద్యాశాఖ విడుదల చేసింది. ఇంకా చదవండి.


2. తుపాను ప్రభావంతో తిరుమలలో విరిగిపడ్డ కొండ చరియలు


ఫెంగల్ తుపాను తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ తీవ్ర ప్రభావం చూపుతోంది. తుపాను ఏపీలో పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలో రెండు, మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో స్థానికులు, శ్రీవారి దర్శనానికి వెళ్తున్న భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ఆదివారం నాడు కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో ఈ మార్గంలో కొంత సమయం వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అయితే టీటీడీ సిబ్బంది అప్రమత్తమై ఎప్పటికప్పుడు జేసీబీలతో రోడ్ల మీదకు వచ్చిన బండరాళ్లను తొలగించి రోడ్డు మార్గాన్ని క్లియర్ చేస్తున్నారు. ఇంకా చదవండి.


3. ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్


2027 నాటికి మావోయిస్టు పార్టీని దేశం నుంచి తుదముట్టించడమే తమ లక్ష్యమని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు ప్రకటించగా.. మీ ఆపరేషన్‌ కాగర్‌ను అడ్డుకోవడమే మా లక్ష్యం అనేలా మావోయిస్టులు వ్యవహరిస్తున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దు, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో అంటే మావోయిస్టుల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో యుద్ధం నడుస్తోందనే చెప్పాలి. నిత్యం తుపాకుల మోతలు, పేలుడు పదార్థాల చప్పుళ్లతో అటవీ గ్రామాలు గుడారాల్లో వణికిపోతున్నాయి. పచ్చని అడవిలో రక్తపు వర్షం కురుస్తోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఇలాంటి భయానక పరిస్థితి నెలకొంది. ఇంకా చదవండి.


4. 'హైడ్రా'పై కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ


తెలంగాణలో హైడ్రా రేపిన దుమారం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం హైడ్రా (HYDRA) నెమ్మదించింది. కూల్చివేతలు ఆగాయి. కాని కూల్చేసిన  నిర్మాణాల ఓనర్లు మాత్రం పుట్టెడు దుఃఖంతో ఉన్నారు. రుణాల ఊబిలో కూరుకుపోయామని నిరాశలో ఉన్నారు. వారికి రుణ మంజూరు నిమిత్తం సంతకాలు చేసిన షూరిటీ దారుల్లో ఆందోళన. స్నేహితుడనో, లేక బంధువనో ష్యూరిటీ ఇచ్చాం.. ఇప్పుడు వాళ్లు లోన్ ఈఎంఐ కట్టలేకపోతే తమ జీతాల్లో కోత పెడతారా.. తమ ఆస్థులు జప్తు చేసి కట్టమంటారా అన్న భయం నెలకొంది. ఇంకా చదవండి.


5. తెలంగాణలో ఆ ఉద్యోగులకు హైకోర్టు షాక్


మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ నోటిఫికేషన్‌ అర్హతల వివాదంపై దొడ్డి దారిన జీవోలు జారీ చేసి ప్రభుత్వం నియామకాలు చేపట్టడం చెల్లదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. హెల్త్ అసిస్టెంట్ (2002) సంబంధిత అర్హతలపై గతంలోనే సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇచ్చిన తీర్పులను ఉల్లంఘించి జీవోలు విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వం నియామకాలు చేపడితే అవి చెల్లుబాటు కావని హైకోర్టు తీర్పు వెలువరించింది. ఇంకా చదవండి.