పుష్పతో ఢీ కొట్టడానికి బన్వర్ సింగ్ షెకావత్ రెడీ అయిపోయారు. మరి కొద్ది రోజుల్లో బన్వర్ సింగ్ షెకావత్‌గా ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) విలనిజాన్ని థియేటర్లలో చూసేయచ్చు. ఆయన ఓ ముఖ్య పాత్రలో నటించిన మరో సినిమా కూడా ఓటీటీలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ ఏడాది మలయాళ చిత్రం ‘ఆవేశం’తో సూపర్ హిట్ కొట్టారు ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil). మరి, ఆయన నుంచి వచ్చే సినిమా అంటే ప్రేక్షకులకు అవే రేంజ్ లో అంచనాలు ఉంటాయి.
సోనీలివ్ లో ‘బోగన్ విల్లా’
అక్టోబర్ నెలలో మలయాళ సినిమా ‘బోగన్ విల్లా’(Bougainvillea) అనే సైకాలజికల్ థ్రిల్లర్ మూవీ తో పలకరించారు ఫహాద్ ఫాజిల్. ఆ మలయాళ సినిమా మాత్రం ఆ రేంజ్ కిక్ ఇవ్వకపోగా... క్రిటిక్స్‌తో పాటు ఆడియన్స్ నూ డిజప్పాయింట్ చేసింది. ఇందులో ఆయన హీరో కాకపోయినా ఓ స్టయిలిష్ పోలీసాఫీసర్ రోల్ అని ట్రయిలర్ ద్వారా చెప్పేశారు దర్శకుడు అమల్ నీరద్. సినిమాటోగ్రఫర్ నుంచి దర్శకునిగా మారిన అమల్... దుల్కర్ సల్మాన్ తో ‘సి.ఐ.ఎ’, మమ్ముట్టితో ‘బిగ్ బి’, ‘భీష్మ పర్వమ్’ లాంటి థ్రిల్లర్ సినిమాలు తీసి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన తాజా సినిమా ‘బోగన్ విల్లా’. ‘నాయట్టు’, ‘2018’, చిత్రాల ఫేమ్ కుంచాకో బోబన్(Kunchacko Boban), జ్యోతిర్మయి ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. పింక్ కలర్ లో పైకి ఆకర్షణీయంగా కనిపించే బోగన్ విల్లా పూలు చుట్టూ ప్రమాదకరమైన ముళ్లు పొంచి ఉంటాయి. ఇందులో రీతు (జ్యోతిర్మయి) పాత్ర కూడా పైకి అమాయకంగా కనిపించినా, ఆమె జీవితంలో ఒక మిస్టరీ ఉంటుంది. దాని చుట్టూ ‘బోగన్ విల్లా’ సినిమా సాగుతుంది. మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా సోనీలివ్ లో డిసెంబర్ 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
Also Read: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడో తెలుసా
‘బోగన్ విల్లా’ కథ లోకి వెళితే...
ఇద్దరు పిల్లలతో హ్యాపీగా సాగిపోతున్న రోయ్స్(కుంచాకో బోబన్), రీతూ(జ్యోతిర్మయి)ల జీవితం అనుకోని యాక్సిడెంట్ కారణంగా కుదేలవుతుంది. రీతూ ఆమ్నీషియా బారిన పడుతుంది. గతం మర్చిపోతుంది. వారి జీవితాల్లోకి మరో పాత్ర ఎంట్రీ ఇస్తుంది. అతనే ఏసీపీ డేవిడ్ ఖోషి(ఫహాద్ ఫాజిల్). కేరళలో టూరిస్టుల సీరియల్ మిస్సింగ్ కేసులు సంచలనంగా మారతాయి. ఈ కేసులకు రీతూకూ సంబంధం ఉందనేది ఏసీపీ ఖోషి సందేహం. ఆమెను అనుమానించి, వెంబడిస్తాడు. నిజంగా ఆమె సస్పెక్టా లేక అమాయకురాలా? అదే ఈ సినిమా కథ. దర్శకుడు అమల్ తన స్టయిల్ లో మరో థ్రిల్లర్ ను తీసినా, ప్రేక్షకులు అంతగా ఆదరించలేదు. లాజో జోస్ రచించిన ప్రముఖ మలయాళ థ్రిల్లర్ నవల ‘రుథింథె లోకమ్’ (Ruthinte Lokam) ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ‘బోగన్ విల్లా’ చిత్రానికి అమల్ తో పాటు లాజో జోస్ కూడా స్క్రీన్ ప్లే అందించారు. మలయాళ సూపర్ స్టార్స్ మోహన్ లాల్ – మమ్ముట్టి కాంబోలో తెరకెక్కుతోన్న ఓ భారీ బడ్జెట్ సినిమాలో ఫహాద్ ఫాజిల్, కుంచాకో బోబన్ లు కీలక రోల్స్ చేస్తున్నారు.
Also Read: వరుణ్ తేజ్ 'మట్కా' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్... Prime Videoలో ఎప్పుడు చూడొచ్చు అంటే?