మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'మట్కా' నవంబర్ 14న థియేటర్లలో విడుదల అయింది. అతి త్వరలో... డిసెంబర్ తొలి వారంలో ఈ సినిమా ఓటీటీలో విడుదలకు రెడీ అయింది.


థియేటర్లలో విడుదలైన రెండు వారాలకు ఓటీటీలో!
Varun Tej's Matka OTT Streaming Date: మట్కా సినిమాకు మొదటి రోజు మొదటి ఆట నుంచి ఫ్లాప్ టాక్ వచ్చింది.‌ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భాగస్వామిగా ఉన్న ఏఏఏ సినిమాస్ సహా కొన్ని స్క్రీన్లలో ఆడియన్స్ టికెట్లు బుక్ చేయని కారణంగా షోలు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. థియేటర్లలో ఆశించిన విజయం సాధించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదలకు రెడీ అయింది.


డిసెంబర్ తొలి వారంలో... 5వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో మట్కా సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రైమ్ వీడియో పేర్కొంది. ఓటీటీలో పాన్ ఇండియా రిలీజ్ అన్నమాట.


Also Read: 'అమరన్' ఓటీటీ రిలీజ్‌ డేట్ అనౌన్స్ చేసిన Netflix... ఈ వారమే స్ట్రీమింగ్, ఎప్పుడు అంటే?






మట్కా సినిమా కథ ఏమిటి? ఎవరెవరు నటించారు?
మట్కా చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. పలాస సినిమాతో దర్శకుడుగా పరిచయమైన ఆయన..‌. ఆ తరువాత సుధీర్ బాబు హీరోగా నటించిన శ్రీదేవి సోడా సెంటర్ సినిమాతో పాటు కళాపురం అనే మరో చిత్రానికి దర్శకత్వం వహించారు. మధ్యలో మెట్రో కథలు అనే వెబ్ సిరీస్ కూడా తీశారు. విడుదలకు ముందు భారీ అంచనాలు సినిమా మీద ఉన్నాయి. అయితే... విడుదల తర్వాత వచ్చిన టాక్ కలెక్షన్ల మీద భారీ ప్రభావం చూపించింది. 


Also Read: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది



మట్కా సినిమాలో వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ రోల్ చేయగా... బాలీవుడ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఫారిన్ బ్యూటీ నోరా ఫతేహి కీలక పాత్రలో నటించారు. కన్నడ నటుడు కిషోర్, 'సత్యం' రాజేష్, అజయ్ ఘోష్, సలోని తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. నవీన్ చంద్ర సిబిఐ అధికారిగా కథలో ఇంపార్టెంట్ రోల్ చేశారు. జీవి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. సినిమా విడుదలైన తర్వాత విమర్శలు రావడంతో అడియన్స్ చాలామంది థియేటర్లకు వెళ్లలేదు. అందువల్ల ఇప్పుడు చాలామంది ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు.


జెన్యూన్ వెర్డిక్ట్ కోసం వెయిట్ చేద్దామని ఓటీటీ రిలీజ్ డేట్ పోస్టర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు దర్శకుడు కరుణ కుమార్. థియేటర్లలో విడుదలైన తర్వాత వచ్చిన స్పందన ఆయనకు నచ్చలేదని దీన్నిబట్టి అర్థం అవుతోంది.